E-Paper
Advertisement

Viral Video: రైలు ఎక్కుతుంటే.. మొబైల్ ఫోన్ జారింది.. వీడియో వైరల్!

Viral Video: రైలు ఎక్కుతుంటే.. మొబైల్ ఫోన్ జారింది.. వీడియో వైరల్!
Advertisement

Railway Viral Video: రైల్వే ప్రయాణం చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. రైళ్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. నిర్లక్ష్యంగా ఉంటే వస్తువులతో పాటు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని పదే పదే వివరిస్తూనే ఉంటారు. కదిలే రైళ్లు ఎక్కుతూ, దిగుతూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉంటాం. పలు ప్రాణాలు కోల్పోయిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అదే సమయంలో, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన, బయటపడేసిన రైల్వే సిబ్బంది వీడియోలు కూడా నెట్టింట చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

రైలు ఎక్కుతుండగా పడిపోయిన మోబైల్

ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో తన జేబులోని సెల్ ఫోన్ జారి ప్లాట్ ఫారమ్ మీద పడిపోతుంది. నలంద ఇండెక్స్ షేర్ చేసిన వీడియోలో, ప్రయాణీకుడు బయలుదేరుతున్న రైలు పక్కన పరిగెత్తి, అది కదులుతున్నప్పుడు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. అతను ఫుట్‌ బోర్డ్‌ లోకి ఎక్కుతుండగా,  ఫోన్ అతని వెనుక జేబులోంచి జారి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోతుంది.

Advertisement

ఈ వీడియోలో ఓ వ్యక్తి కింద పడిపోయిన ఫోన్ ను తీసి మరో వ్యక్తికి అందిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండో వ్యక్తి ఆ ఫోన్ ను పోగొట్టుకున్న ప్రయాణీకుడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు ఫోన్ పడేసుకున్న వ్యక్తి డోర్ దగ్గర నిలబడి తన ఫోన్ ఇవ్వమని చేతితో సైగ చేస్తాడు. కానీ, అంతలోగా రైలు వేగం పెరుగుతుంది. ప్లాట్ ఫారమ్ నుంచి వెళ్లిపోతుంది.  ప్రయాణీకుడు తన సెల్ ఫోన్ పోగొట్టుకోవాల్సి వస్తుంది.

Advertisement

“ఇది రైల్వే ప్రయాణీకుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో చూపించే ఘటన. ప్రజలు ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించినప్పుడు కచ్చితంగా ఇలాగే జరుగుతుంది. కదులుతున్న రైలు ఎక్కడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. కొన్నిసార్లు ఇటువంటి సంఘటనల కారణంగా ప్రాణాలు పోతాయి. భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదు” అని నలంద ఇండెక్స్ షేర్ చేసిన ఈ వీడియోకు రాసుకొచ్చింది.

Read Also: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ప్రయాణీకుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రయాణీకులు ఆకస్మాత్తుగా దిగి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉందంటున్నారు. రన్నింగ్ ట్రైన్స్ ఎక్కడం, దిగడం మంచిది కాదని ఈ ఘటన తెలియజేస్తుందంటున్నారు. రైలు ప్రయాణాల్లో ప్యాసింజర్స్ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×