E-Paper
Advertisement

Viral Video: విమానంలో చాయ్ చాయ్.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: విమానంలో చాయ్ చాయ్.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

రైలు ప్రయాణంలో చాయ్, కాఫీ అంటూ చాలా మంది వస్తుంటారు. వారి దగ్గరి నుంచి చాలా మంది టీ, కాఫీలు కొని తాగుతారు. కానీ, విమానంలో ఎవరైనా టీ అమ్మడం చూశారా? విమానంలో టీ అమ్మడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా  ఈ ఘటన ఇండిగో ఫ్లైట్ లో జరిగింది. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి..

Advertisement

విమానాల్లో వింత ఘటనలు

గత కొంత కాలంగా విమానాల్లో ఆశ్చర్యక సంఘటనలు జరగుతున్నాయి. తాజాగా సూరత్-బ్యాంకాక్ ఫ్లైట్ లో ప్రయాణీకులు ఏకంగా 15 లీటర్ల మద్యం తాగగా, తాజాగా మరో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. అచ్చం రైల్లో మాదిరిగానే విమానంలో ఓ ప్రయాణీకులు తన దగ్గర ఉన్న ఫ్లాస్క్ లో నుంచి వేడి వేడి టీ కప్పులలో పోసి ప్రయాణీకులకు అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి చేతిలో కప్పులు పట్టుకొని ఉండగా, మరో వ్యక్తి ఫ్లాస్క్ లోని చాయ్ పోస్తూ ప్యాసెంజర్లకు ఇస్తున్నాడు.  తొలుత ఓ రాజస్థానీ వస్త్రధారణలో ఉన్న మహిళకు చాయ్ ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత ఇతర ప్రయాణీకులకు కూడా అందించాడు.

Advertisement

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ తంతంగాన్ని అంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో నాలుగు లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో సటైర్లు వేస్తున్నారు. “ఇంతకాలం రైళ్లలోనే చాయ్ అమ్ముతారు అనుకున్నా. ఇప్పుడు విమానాల్లోనూ అమ్ముతున్నారు. మొత్తానికి విమానాన్ని రైలు బండి చేసేశారు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇకపై విమనాల్లోనూ ఇలాంటివే చూడాల్సి వస్తుంది” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఓ వ్యక్తి ఫ్లాస్క్ లో టీ తెచ్చి అందరికీ పోస్తుంటే క్యాబిన్ క్రూ, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే, ఈ ఘటన రాజస్థాన్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో జరిగినట్లు తెలుస్తోంది.

4 గంటల్లో 15 లీటర్ల మద్యం ఖాళీ

ఇక తాజాగా సూరత్- బ్యాంకాక్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులు మద్యం అంతా ఖాళీ చేసిన ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. కేవలం 4 గంటల వ్యవధిలో విమానంలోని మద్యం అంతా ఖాళీ చేసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ మద్యం విలువ సుమారు 1.8 లక్షలు ఉంటుందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చరిత్రలో ప్రయాణీకులు ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం తాగలేదని సంస్థ వెల్లడించింది. అంతేకాదు,బ్యాంకాక్ చేరుకోక ముందే విమానంలో మద్యం అయిపోయిందని సిబ్బంది అనౌన్స్ చేయడం విశేషం.

Read Also:ఈ కేఫ్ లో 15 నిమిషాలకు ఓసారి వర్షం, కాఫీ తాగాలంటే రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే!

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×