E-Paper
Advertisement

Viral Video: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..

Viral Video: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..
Advertisement

చాలా మంది ఔత్సాహికులు ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అయితే, కొంత మంది మాత్రమే సక్సెస్ ఫుల్ గా శిఖరాగ్రాలకు చేరుకుంటారు. చాలా మంది మధ్య నుంచే వెనక్కి వస్తారు. పర్వతాలను ఎక్కడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. మార్గం మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇక తాజాగా ఓ జంట పోలాండ్ లోని ఎత్తైన పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్ర విమర్శలపాలైంది. ఇంతకీ అసలు  ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పాపతో పాటు జంటను కాపాడిన మౌంటెన్ గైడ్

పర్వతాలు ఎక్కే సమయంలో కొన్ని కచ్చితంగా పాటించాల్సిన భద్రతా చర్యలు ఉంటాయి. తాజాగా ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తూ లిథువేనియన్ జంట పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేసింది. ప్రమాదకరమైన శీతాకాల పరిస్థితుల్లో వారి 9 నెలల పాపతో పోలాండ్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ రైసీని అధిరోహించడానికి ప్రయత్నించారు. అయితే, పూర్తిగా ఎక్కలేక మధ్యలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దట్టమైన మంచుతో కూడిన పరిస్థితులలో చిక్కుకుపోయారు. పైకి ఎక్కలేక, కిందికి దిగలేక, అవస్థలు పడ్డారు. ఈ సమయంలో ఓ మౌంటెన్ గైడ్ పాపతో పాటు ఆ జంటకు కాపాడాడు. తమ పాపను సురక్షితంగా తీసుకువెళ్లే ముందు ఆమె తండ్రి గైడ్ నుంచి క్రాంపాన్లను కూడా తీసుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రమాదకరమైన వాతావరణంలో హెచ్చరికలను విస్మరిస్తూ.. 

Advertisement

రైసీ పర్వతంపై పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ స్థానిక గైడ్లు, రక్షణ సిబ్బంది హెచ్చరికలు చేసినప్పటికీ, ఆ జంట పట్టించుకోలేదన్నారు. మంచు, మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రత్యేకమైన పరికరాలు, అనుభవం అవసరమన్నారు. పాప తల్లిదండ్రులకు ఈ రెండూ లేకపోయినా ఎక్కేందుకు ప్రయత్నించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

పాపతో కలిసి పర్వతాలు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమైన జంట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది తల్లిదండ్రుల వ్యవహారం బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఉందంట నిప్పులు చెరిగారు. “కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను పణంగా పెట్టి ఇంత ప్రమాదకర నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లేదు. శిశువుకు ఇబ్బంది కలిగించకుండా ప్రకృతిని ఆస్వాదించడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం ఎంచుకోవాల్సిన అవసరం లేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.  “వారు తెలిసీ శిశువు ప్రాణానికి ముప్పు కలిగించే ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతుంది. పోలీసులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ పర్వతాన్ని ఎక్కేందుకు అవసరమైన సామగ్రి లేకుండా తొమ్మిది నెలల పాపతో కలిసి పర్వతం ఎక్కడం నిజంగా నిర్లక్ష్యమే.  గైడ్ శిశువును రక్షించడం నిజంగా ఆమె అదృష్టం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఈ ఘటనలో పాపతో పాటు ఆ జంటను గైడ్ సురక్షితంగా కిందికి దించాడు. కానీ, తల్లిదండ్రుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Advertisement

Read Also:

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×