E-Paper
Advertisement

రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలెట్.. సోషల్ మీడియాలో వైరల్.. అసలు మ్యాటర్ చెప్పిన రైల్వే!

రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలెట్.. సోషల్ మీడియాలో వైరల్.. అసలు మ్యాటర్ చెప్పిన రైల్వే!
Advertisement

Indore Viral Train Samosa Video: మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ లోకో పైలట్ రైలును ఆపి, పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి సమోసాలు కొనుగోలు చేస్తున్నట్లు కనిపించింది. “సమోసాల కోసం రైలును ఆపేశాడు” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రయాణికులు, నెటిజన్లు రైల్వే అధికారుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ వెంటనే విచారణ చేపట్టింది. విచారణ అనంతరం వైరల్ అవుతున్న ప్రచారంలో పూర్తి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే?

రైల్వే అధికారుల వివరాల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్నది ప్యాసింజర్ రైలు కాదు. అది గూడ్స్ రైలు. ఆ సమయంలో రైలును లోకో పైలట్ తన ఇష్టానుసారం ఆపలేదని, ముందుగా సిగ్నల్ రావడంతోనే రైలు నిలిచిపోయిందని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున సిగ్నల్ కారణంగా రైలు కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అదే సమయంలో లోకో పైలట్ సమీపంలోని దుకాణానికి వెళ్లి సమోసాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అందువల్ల  సమోసాల కోసం రైలును ఆపేశాడనే అనే ప్రచారం వాస్తవం కాదని రైల్వే అధికారులు వెల్లడించారు.

పూర్తి ఘటనపై కొనసాగుతున్న విచారణ

Advertisement

అయితే, మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైలు నిలిచి ఉన్న సమయంలో లోకో పైలట్ ఇంజిన్‌ నుంచి దిగి బయటకు వెళ్లడం నిబంధనలకు అనుగుణమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా రైల్వే శాఖ అంతర్గతంగా పరిశీలన కొనసాగిస్తున్నట్లు సమాచారం. వైరల్ వీడియో నేపథ్యంలో మొత్తం ఘటనపై పూర్తి నివేదిక కోరిన అధికారులు, విధి నిర్వహణలో ఏదైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను వెంటనే నమ్మకూడదనే విషయాన్ని గుర్తు చేసింది. పూర్తి సమాచారం బయటకు రాకముందే ఇష్టం వచ్చినట్లు ప్రచారం మంచిది కాదని తేలిపోయింది. ఈ ఘటనలో కూడా మొదట ప్రచారం జరిగిన విధానానికి, విచారణలో బయటపడిన వాస్తవాలకు తేడా ఉండటంతో నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: విజయవాడ రైల్వే సూపర్ పెర్ఫార్మెన్స్.. రద్దీలోనూ అద్భుతం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×