E-Paper
Advertisement

Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?

Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?
Advertisement

Vande Bharat Vs Amrit Bharat Train Comparison: భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా పూర్తి స్థాయిలో అప్ గ్రేడ్ అయ్యింది. గతంతో పోల్చితే ఈ పదేళ్ల కాలంలో అత్యాధుని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సరి భద్రతా వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. నిరంతరంగా రైల్వే అప్ గ్రేడేషన్ కొనసాగుతోంది. వందే భారత్, అమృత్ భారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైల్లు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అధిక వేగం, ప్రీమియం సౌకర్యాలకు ప్రసిద్ధి చెందగా, అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్‌ను సాధారణ ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని సరసమైన, సుదూర ప్రయాణం కోసం ప్రారంభించారు. వేగం, ఛార్జీలు, కోచ్ కాన్ఫిగరేషన్ సహా రెండు రైళ్ల మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ఉదేశం!  

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అత్యాధునికి హైస్పీడ్ రైలు, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రూపొందించబడింది. అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ సాధారణ ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చులో సుదూర ప్రయాణాలను అందిస్తుంది.

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల  వేగం

Advertisement

వందే భారత్ రైలు గరిష్టంగా వేగం గంటకు 180 కిలో మీటర్లు. అయితే. సాధారణ ఆపరేషన్ గంటకు 130-160 కి.మీ వరకు కొనసాగుతుంది. అటు అమృత్ భారత్ రైలు గరిష్ట వేగం గంటకు 130 కిలో మీటర్లు.

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల  ఛార్జీలు

వందే భారత్ రైళ్లు ప్రీమియం కేటగిరీలోకి వస్తాయి. వాటి ఛార్జీలు సాధారణ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి. అమృత్ భారత్ రైళ్లు సాధారణ, మధ్యతరగతి ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తీసుకువచ్చారు. సో, వాటి ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల లోఎన్ని కోచ్‌లు ఉంటాయి?

Advertisement

అమృత్ భారత్ రైళ్లు సాధారణంగా స్లీపర్, జనరల్ కోచ్‌ లతో సహా 22 కోచ్‌లను కలిగి ఉంటాయి. వందే భారత్ రైళ్లు సాధారణంగా 8 లేదంటే 16 ఆధునిక కోచ్‌లను కలిగి ఉంటాయి. ఇప్పుడు 20, 24 కోచ్ ల రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల కోచ్‌లు, సౌకర్యాలు

వందే భారత్ రైళ్లలో పూర్తిగా AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అమృత్ భారత్ రైళ్లలో నాన్ AC స్లీపర్,   జనరల్ కోచ్‌లు ఉన్నాయి. దీని వలన ఎక్కువ మంది ప్రయాణీకులు తక్కువ ఛార్జీలతో ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఎవరికి ఏ రైళ్లు అనుకూలంగా ఉంటాయి?  

వందే భారత్ రైళ్లు ప్రధానంగా వేగవంతమైన ఇంటర్‌ సిటీ ప్రయాణం కోసం రూపొందించబడ్డాయి. అమృత్ భారత్ రైళ్లు సుదూర ప్రాంతాలకు, ఎక్కువ ప్రయాణీకుల రద్దీకి అనుకూలంగా రూపొందించబడ్డాయి.

సాధారణ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యం  

వేగవంతమైన, ప్రీమియం ప్రయాణం కోసం వందే భారత్ రైళ్లను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అమృత్ భారత్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది అన్ని తరగతుల ప్రయాణికులకు మెరుగైన ఎంపికలను అందిస్తుంది.

Read Also: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×