E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: రసగుల్లా To బసంతి పులావ్.. వందేభారత్ స్లీపర్ ఫుడ్స్ భలే ఉన్నాయే!

Vande Bharat Sleeper Train: రసగుల్లా To బసంతి పులావ్.. వందేభారత్ స్లీపర్ ఫుడ్స్ భలే ఉన్నాయే!
Advertisement

Vande Bharat Sleeper Train Food Menu: దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం అయ్యింది.  హౌరా-కామాఖ్య రూట్ లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ స్లీపర్ రైలు సుదూర రాత్రిపూట ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేశారు. అంతేకాదు,  కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌ బోర్డ్ మెనూ కోసం ప్రయాణీకులను ఆకట్టుకుంటుంది. ఈ రైల్లో స్థానికతకు పెద్ద పీట వేస్తూ బెంగాల్, అస్సాం ఫుడ్స్ కు చోటు కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో గౌహతిలోని మేఫెయిర్ స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్ ఈ మెనూను తయారు చేసింది. ఈ మెనూలో ఎక్కువ శాకాహారానికే ప్రాధాన్యత ఇచ్చింది.

ఆకట్టుకునే బెంగాల్‌ వంటకాలు  

ఈ రైల్లో బెంగాల్ లోని ప్రముఖ వంటకాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా  బసంతి పులావ్, చోళర్ పప్పు, మూంగ్ పప్పు, చనార్, ధోకర్ ను మెనూలో చేర్చారు. ఈ వంటకాలు నెమ్మదిగా వండుతారు. తేలికపాటి మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. రాత్రి పూట సుదూర ప్రయాణాలకు అనుగుణంగా ఈ ఆహారం అందిస్తారు.

సంప్రదాయ అస్సామీ వంటకాలు

Advertisement

బెంగాల్ తో పాటు అస్సాం స్థానిక వంటకాలను ఈ మెనూలో చేర్చారు. జోహా రైస్, మతి మోహోర్, మసూర్ డాలీ, సహా కూరగాయలతో తయారు చేసే బజ్జీలు ఉన్నాయి. చక్కటి రుచులు, స్థానిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వీటిని ఎంపిక చేశారు. మొత్తంగా ఈ మెనూలో బెంగాల్, అస్సాం ఫుడ్స్ తో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల ఫుడ్స్ ను చేర్చారు. ప్రయాణ సమయంలో సులభంగా ఆస్వాందిచే ఫుడ్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.

మెనూలో స్వీట్లకూ చోటు

వందేభారత్ స్లీపర్ రైల్లోని మెనూలో సాంప్రదాయ స్వీట్లను చేర్చారు. సందేశ్, నారికోల్ బర్ఫీ, రసగుల్లా లాంటి బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టపడే డెజర్ట్స్ ను అందిస్తున్నారు.

వందే భారత్ స్లీపర్ రైలు గురించి..   

Advertisement

హౌరా-కామాఖ్య వందే భారత్ స్లీపర్ దేశంలో రాత్రిపూట ప్రయాణించే తొలి వందే భారత్ సర్వీస్ గా గుర్తింపు తెచ్చుకుంది.  ఇది దాదాపు 1,000 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్ ను కలిగి ఉంటాయి. వీటిలో ఫస్ట్ ఏసీ, ఎసీ 2-టైర్, ఏసీ 3-టైర్ క్లాస్ లు ఉన్నాయి.

Read Also: వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

ఇందులో ఒకేసారి 823 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎర్గోనామిక్ బెర్త్‌ లు, ఆటోమేటిక్ డోర్లు, అధునాతన సస్పెన్షన్,సౌండ్ ప్రూఫ్ వ్యవస్థలు, కవచ్ యాంటీ-కొలిషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణం చేస్తుంది. ఈ సర్వీసు తూర్పు భారతం, ఈశాన్య ప్రాంతాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన రాత్రిపూట ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also: వందేభారత్ లో నో వీఐపీ కల్చర్, రైల్వేమంత్రి కీలక ప్రకటన!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×