E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: వందేభారత్ లో నో వీఐపీ కల్చర్, రైల్వేమంత్రి కీలక ప్రకటన!

Vande Bharat Sleeper Train: వందేభారత్ లో నో వీఐపీ కల్చర్, రైల్వేమంత్రి కీలక ప్రకటన!
Advertisement

First Vande Bharat Sleeper Train: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవాళ(జనవరి 17) పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఈ రైలుకు జెండా ఊపి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు బెంగాల్ లోని హౌరా, అస్సాంలోని గౌహతి(కామాఖ్య) మధ్య రాకపోకలు కొనసాగించనుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. 958 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది.

వందేభారత్ స్లీపర్ లో నో వీఐపీ ట్రీట్మెంట్

ఇక వందేభారత్ స్లీపర్ రైల్లో సాధారణ ప్రయాణీకులకు పెద్ద పీట వేశారు. ఎలాంటి VIP ట్రీట్మెంట్ ఉండదు. ఈ రైలులో టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ అనేది ఉండదని భారతీయ రైల్వే వెల్లడించింది.

ఈ రైలు ఏ నగరాలను కలుపుతుందంటే?

Advertisement

వందేభారత్ స్లీపర్ రైలు అస్సాంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్, బొంగైగావ్ జిల్లాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్, జల్పైగురి, మాల్దా, ముర్షిదాబాద్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ, హౌరా జిల్లాలకు డైరెక్ట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది ఈశాన్య, తూర్పు భారత్ మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.

నో VIP, నో ఎమర్జెన్సీ కోటా

వందే భారత్ స్లీపర్ రైలులో ఏ రకమైన VIP, అత్యవసర కోటా ఉండదు. సీనియర్ రైల్వే అధికారులు కూడా పాస్‌లను ఉపయోగించి ప్రయాణించలేరు. రైలులో కన్ఫార్మ్ టిక్కెట్లు ఉన్న వాళ్లు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) కోసం ఎటువంటి నిబంధన ఉండదు. వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ధృవీకరించబడిన టిక్కెట్లను మాత్రమే అధికారులు అనుమతిస్తారు.

అప్‌గ్రేడ్ చేసిన సౌకర్యాలు

Advertisement

వందేభారత్ స్లీపర్ రైల్లో ప్రయాణీకులకు అందించే బెడ్ లినెన్ పూర్తిగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఇందులో దుప్పటికి కవర్ ఉంటుంది. నాణ్యత సాధారణ రైళ్ల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. భారతీయ సంస్కృతిని ప్రదర్శించడానికి, సిబ్బంది యూనిఫాంలు భారతీయ నాగరికత, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రయాణీకులకు అందించే ఫుడ్ విషయంలోనూ లోకల్ రుచులు ఉంటాయి.  అస్సాం, బెంగాల్ లోని ప్రముఖ వంటకాలు ఈ స్లీపర్ రైలు మెనూలో ఉంటాయి.

Read Also: పట్టాలెక్కిన ఫస్ట్ వందేభారత్ స్లీపర్, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే?  

తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన తొలి వందేభారత్ స్లీపర్ రైలు రైలు గౌహతి (అస్సాం), హౌరా (పశ్చిమ బెంగాల్) మధ్య నడుస్తుందని చెప్పారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు.  ఈ రైలులో 16 అత్యాధునిక  కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 ఎసి త్రీ టైర్ కోచ్‌లు, నాలుగు ఎసి టూ టైర్ కోచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఎసి కోచ్ ఉన్నాయి.

Read Also: వందే భారత్ వెర్షన్ 4.0 వచ్చేస్తోంది.. దీని స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×