E-Paper
Advertisement

Vande Bharat Sleeper Menu: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!

Vande Bharat Sleeper Menu: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!
Advertisement

Vande Bharat Sleeper Dining Upgrade: వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ఫుడ్ మెనులో స్థానిక వంటకాలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయారిటీ ఇచ్చింది. హౌరా- గౌహతి మధ్య సర్వీసులు అందిస్తున్న వందేభారత్ స్లీపర్.. బెంగాల్, అస్సోం వంటకాలకు ఫుడ్ మెనులో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, తాజాగా కొత్త మెనును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు IRCTC ప్రకటించింది. తాజాగా కొత్త ఫుడ్ లిస్టుతో కొత్త మెనును ప్రకటిచింది.

వందే భారత్ స్లీపర్ రైల్లో కొత్త ఫుడ్ మెనూ

తాజాగా హౌరా–కామాఖ్య–హౌరా వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులు వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ ను తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1న, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందేభారత్ స్లీపర్ ఫుడ్ కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలులో త్వరలో నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ ను కూడా తీసుకొస్తామని వెల్లడించింది. గతంలో, IRCTC విడుదల చేసిన మెనూలో ఫిష్, చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ ఆప్షన్స్ లేవు.

Advertisement

టీ, బిస్కెట్లు, మఫిన్లతో పాటు, హౌరా నుంచి కామాఖ్యకు వందే భారత్ స్లీపర్ (రైలు నంబర్ 27575)లో ప్రయాణించే ప్రయాణికుల కోసం IRCTC మూడు వేర్వేరు ఫుడ్ మెనునూ రెడీ చేసింది. రైలు నంబర్ 27575, హౌరా-కామాఖ్య వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణించే ప్రయాణికులకు బసంతి పులావ్, గీ రైస్, పచ్చి బఠానీ పులావ్‌ తో పాటు పరోటా, చోళర్ పప్పు, ఆలూ గజర్ మేథి మతార్ భాజా, ఝురి ఆలూ భజా కూడా అందిస్తారు.  భోజనంలో మాతార్ పన్నీర్, చానర్ దల్నా, ధోకర్ దల్నా కూడా ఉంటాయి. నాన్ వెగ్ మెనూలో బెంగాలీ చికెన్ కర్రీ, ముర్గ్ రోగిని,ముర్గిర్ జోల్ ఉంటాయి. డెజర్ట్ ఆప్షన్స్ లో సందేశ్, కాలా జామున్, ఖీర్ కదమ్ ఉంటాయి.

వందే భారత్ స్లీపర్ రైలు కోసం IRCTC ఆహార మెను

అటు టీ, బిస్కెట్లు, మఫిన్లతో పాటు, వందే భారత్ స్లీపర్ ప్రయాణీకులకు IRCTC మూడు స్పెషల్ ఫుడ్ మెనులను రెడీ చేసింది. కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్‌ లో జీరా రైస్, జీరా కార్న్ పులావ్, కిస్మిష్ పులావ్‌ తో పాటు తెహ్దార్ పరాఠను అందిస్తారు. ఇందులో మిక్స్ డ్ పప్పు, లెసెరా ఆలూ భాజీ, భేండి ఆలూ భాజీ, బీన్స్ ఆలూ భాజీ కూడా ఉంటాయి. ఇక ఫుడ్ లో పన్నీర్ మసాలా, కడై పన్నీర్ కూడా ఉంటాయి. నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్లలో చికెన్ మసాలా, చికెన్ కర్రీ ఉంటాయి. డెజర్ట్ ఆప్షన్లలో నారికల్ బర్ఫీ, లాల్ మోహన్, రసగుల్లా ఉంటాయి.

జనవరి 17న స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

Advertisement

జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. కామాఖ్య-హౌరా-కామాఖ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ జనవరి 22 నుంచి తన కమర్షియల్ ఆపరేషన్స్ ను మొదలుపెట్టింది.

Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. రెండు రోజుల పాటు ఈ రూట్లలో 8 రైళ్లు క్యాన్సిల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×