E-Paper
Advertisement

Srinagar Vande Bharat: కాశ్మీర్‌ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Srinagar Vande Bharat: కాశ్మీర్‌ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Advertisement

Delhi to Srinagar Vande Bharat: తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ద్వారా న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్‌ను ఈ రైలు కలపనుంది. అత్యాధునిక రైలును ప్రధాని మోడీ జనవరి 26న జెండాఊపి ప్రారంభించనున్నారు. ఈ సెమీ హై స్పీడ్ రైలు ఢిల్లీ, కాశ్మీర్ మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 13 గంటల్లోగా పూర్తి చేయనుంది. దేశంలో 800 కిలో మీటర్లకు పైగా ప్రయాణించే తొలి డైరెక్ట్ సర్వీస్ ఇదే కావడం విశేషం.

కోచ్ లు, టికెట్ ధరల వివరాలు 

Advertisement

వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 7:00 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది, జమ్మూ తావి, కత్రా, బనిహాల్‌ లో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ రైలు 16 కోచ్ లను కలగి ఉంటుంది. వీలో 11 AC 3-టైర్ కోచ్‌లు, 4 AC 2-టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ AC కోచ్‌ ను కలిగి ఉంటుంది. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ విషయానికి వస్తే.. AC 3-టైర్‌కు రూ. 2,000, AC 2-టైర్‌కు రూ.2,500, ఫస్ట్ ACకి రూ.3,000గా నిర్ణయించారు.

ఈ రైలు ప్రారంభంతో కలిగే లాభాలు

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ తో జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక రంగం మరింత డెవలప్ కానుంది. అక్కడి నుంచి  పండ్లు, పూలు, కూరగాయలు ఢిల్లీకి అత్యంత వేగంగా చేరుకోనున్నాయి. స్థానిక వ్యాపారాలకు చక్కటి ప్రోత్సాహం లభించనుంది. కాశ్మీర్- న్యూఢిల్లీ వందేభారత్ రైలు ప్రారంభం తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్ డెవలప్ మెంట్ కు ఈ రైలు అద్భుతమైన ఊతం అందించనుంది.

చివరి దశకు చేరిన రైల్వే ట్రాక్ నిర్మాణం

అటు ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన  ఏరియాల మధ్య  కనెక్టివిటీని పెంచనుంది.  ఇప్పటి వరకు జమ్మూలోని కత్రా వరకు మాత్రమే రైల్వే నెట్ వర్క్ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 37,012 కోట్లను అందించింది. ఈ డబ్బుతో జమ్మూ- శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. బారాముల్లా, శ్రీనగర్, ఖాజిగుండ్, బనిహాల్, సంగల్దాన్ మధ్య రైల్వే కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. దీనిని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లైనుకు కలపనున్నారు. ఈ రైలు సర్వీస్ కోసం చీనాబ్ నదిపై  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం USBRL ప్రాజెక్టులో భాగంగా 272 కిలో మీటర్లలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించింది. ఇప్పటికే 255 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. కత్రా- రియాసీ మధ్య కేవలం 17 కిలో మీటర్ల మేర నిర్మాణం కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయి. జనవరిలో ప్రధాని మోడీ ఈ రైల్వే లైన్ మీదుగా కాశ్మీర్-న్యూఢిల్లీని కలిపే వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు.

Read Also: కాకినాడ – కోటిపల్లి రైలు బస్సుకు మళ్లీ పూర్వ వైభవం.. త్వరలోనే గుడ్ న్యూస్? పవన్ ఇదొక్కటీ చేస్తే చాలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×