E-Paper
Advertisement

Thanksgiving travel: విమానాలపై ఆంక్షలు ఎత్తివేత, అమెరికా కీలక నిర్ణయం!

Thanksgiving travel: విమానాలపై ఆంక్షలు ఎత్తివేత, అమెరికా కీలక నిర్ణయం!
Advertisement

అమెరికాలో అక్టోబర్ లో ప్రారంభమైన ప్రభుత్వ షట్ డౌన్ కు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులను తగ్గించాలన్న అత్యవసర ఉత్తర్వును అమెరికారవాణా శాఖ వెనక్కి తీసుకుంది. షట్ డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తమ విధులకు రావడం మానేశారు. ఇప్పుడు మళ్లీ వారంతా ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందటే?   

ఈ ఏడాది అక్టోబర్‌ లో అమెరికాలో ప్రభుత్వ షట్‌ డౌన్ ప్రారంభం అయ్యింది. ముఖ్యమైన ఉద్యోగులు జీతం లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విధులకు హాజరు కాలేదు. ఫలితంగా భద్రతా చర్యల్లో భాగంగా విమాన సర్వీసులను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని విమానాలను రద్దు చేయగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. భద్రతా సమస్యలను నివారించడానికి షెడ్యూల్ చేసిన టేకాఫ్‌లను తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నవంబర్ 7న విమానయాన సంస్థలను ఆదేశించింది. గత వారం షట్‌డౌన్ ముగిసినప్పటి నుంచి.. సిబ్బంది మళ్లీ విధుల్లో చేరుతున్నారు.

థ్యాంక్స్ గివింగ్ హాలీడేకు ముందు కీలక నిర్ణయం

Advertisement

థాంక్స్ గివింగ్ హాలీడే సందర్భంగా అమెరికాలో 6 మిలియన్లకు పైగా ప్రజలు విమాన ప్రయాణాలు చేస్తారని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. గత సంవత్సరం కంటే దాదాపు 2% ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  ప్రసిద్ధ ట్రావెల్ గ్రూప్ AAA.. USలో అత్యంత ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేది హాలీడే.. థ్యాంక్స్ గివింగ్ హాలీడే అని వెల్లడించింది.  “ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తమ విధుల్లోకి తిరిగి వచ్చారు. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి” అని రవాణా కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించారు. సుమారు 43 రోజుల షట్‌ డౌన్ తర్వాత మళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ షట్ డౌన్ US చరిత్రలో అతి పొడవైనదిగా ఆయన అభివర్ణించారు.

Read Also:  భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలు.. ఎప్పటి నుంచి అంటే?

ట్రాఫిక్ కంట్రోలర్ల కొరతతో విమాన సర్వీసుల రద్దు

Advertisement

షట్ డౌన్ కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దేశీయ విమానాలలో 10% వరకు తగ్గించాలని అమెరికా ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలో వేలాది విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. పలు విమానాలు ఆలస్యం అయ్యాయి. షట్‌డౌన్ ముగియడంతో, కంట్రోలర్లు తిరిగి జీతం పొందబోతున్నారు. విమాన సర్వీసులు ఎప్పటి లాగానే కొనసాగనున్నాయి.  ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Read Also: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×