E-Paper
Advertisement

Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
Advertisement

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది లోగా పనులు పూర్తవుతాయని వెల్లడించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్టేషన్ అంతటా కలియ తిరుగుతూ పనులను గమనించారు.  ఈ సందర్భంగా స్టేషన్ లో జరుగుతున్న పనుల పురోభివృద్ధి గురించి రైల్వే అధికారులు ఆయనకు వివరించారు.

ఎంతో మంది ఉద్యోగులకు మేలు

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పూర్తయితే ఎంతోమంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ రైల్వే స్టేషన్‌ మొదటి దశ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందుకోసం  రూ. 25 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రెండవ దశకు రూ. 10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ను రూ.35 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.  స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారని చెప్పారు. రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణ సహా రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లలో డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను యాదాద్రి వరకు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అందుకోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు కిషన్ రెడ్డి.

Advertisement

వచ్చే ఏడాదిలోపు సికింద్రాబాద్ ఆధునీకరణ పూర్తి

అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఏడాదిలో పూర్తవుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే అద్భుతమైన రైల్వే స్టేషన్ గా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఏకంగా రూ.719 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది డిసెంబర్​నాటికి ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోడీ ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారని చెప్పారు.

Advertisement

Read Also: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!

అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తర్వాత రోజుకు 2.5 నుంచి 3 లక్షల వరకు ప్రయాణించేలా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు కిషన్ రెడ్డి. 3వేల మంది కూర్చునేలా వెయిటింగ్​ హాల్, ఆధునిక క్యాంటీన్, రెస్టారెంట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చిత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్టేషన్ లో మొత్తం 26 లిఫ్ట్​లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ట్రైన్ ​దిగిన వాళ్లు, మెట్రోస్టేషన్లకు వెళ్లేలా స్ట్, వెస్ట్​ సైడ్​ నేరుగా వాక్​ త్రూ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ ​భద్రతకు అడ్వాన్సుడ్​ సెక్యూరిటీ సిస్టమ్ ​ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: అయ్యప్ప భక్తులకు ప్రత్యేక వెసులుబాటు, విమానయాన శాఖ కీలక నిర్ణయం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×