E-Paper
Advertisement

Vande Bharat Trains: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!

Vande Bharat Trains: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

Two Vande Bharat Trains To Be Discontinued: భారతీయ రైల్వేలోకి సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు అడుగు పెట్టాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో లగ్జరీ సౌకర్యాలతో ఆహ్లాదకర ప్రయాణాలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 150కి పైగా మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఎక్కువ ప్రయాణీకులు ఉండే ప్రాంతాల్లో వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధికారులు. అదే సమయంలో తక్కువ ప్రయాణీకులు ఉన్న మార్గాల్లో ఈ రైలు సేవలు నిలిపివేస్తున్నారు. తాజాగా దేశంలో రెండు సర్వీసులను క్యాన్సిల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ రూట్ లో ఆ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నారు? ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయపూర్‌ రూట్ లో రెండు రైళ్లు క్యాన్సిల్  

రైల్వేబోర్డు తాజా నిర్ణయం ప్రకారం ఉదయపూర్- ఆగ్రా కాంట్ మధ్య నడిచే రైలు (నంబర్ 20981/82) ఫిబ్రవరి 15, 2026 నుంచి నిలిపివేయబడుతుంది. అటు ఉదయపూర్- జైపూర్ మధ్య నడుస్తున్న రైలు (నంబర్ 20979/80) ఫిబ్రవరి 14, 2026 నుంచి సర్వీసులు నిలిచిపోనున్నాయి.  ఈ రైళ్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం తక్కువ ప్రయాణీకుల రద్దీ. ఆ మార్గంలో పరిమిత స్టాప్‌లు కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణం అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగ్రా కనెక్టివిటీపై ప్రభావం పడే అవకాశం

Advertisement

ఇక ఉదయపూర్-ఆగ్రా కాంట్ వందేభారత్ సర్వీసు నిలిపివేయడంతో ఆగ్రా నుంచి ప్రయాణించే వందేభారత్ సర్వీసుల సంఖ్య మూడుకి తగ్గుతుంది. ముఖ్యంగా వేగవంతమైన కనెక్షన్లను కోరుకునే ప్రయాణికుల కోసం, వందే భారత్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రధాన పర్యాటక కేంద్రమైన ఆగ్రా ప్రయోజనం పొందింది. కానీ, ఇప్పుడు ఆ మార్గంలో నడిచే వందేభారత్ సర్వీసులను నిలిపివేయడం ద్వారా, ఆగ్రా కనెక్టివిటీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టూరిస్టులకు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!

వందేభారత్ రైళ్ల గురించి..

Advertisement

వందే భారత్ రైళ్లను భారతీయ రైల్వేలలోకి అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లుగా తీసుకొచ్చారు. వీటి రాకతో ఇండియన్ రైల్వేలో కొత్త అధ్యాయం మొదలయినట్లు అయ్యింది. మెరుగైన వేగం, ఆధునిక కోచ్‌లు, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 150కి పైగా మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మరిన్ని కొత్త మార్గాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అదే సయంలో తక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్ల సేవలను క్యాన్సిల్ చేస్తున్నారు అధికారులు. వాటిని ఎక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న ప్రాంతాల్లోకి మళ్లిస్తున్నారు.  అందులో భాగంగానే ఉదయపూర్, ఆగ్రా కాంట్, జైపూర్ మధ్య నడిచే రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఈ మార్గాల్లోని ప్రయాణీకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ రైలు సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×