// // Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు! -->
E-Paper
Advertisement

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!
Advertisement

Indian Raillways:

భారతీయ రైల్వేలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది వందేభారత్ ఎక్స్ ప్రెస్. అత్యంత వేగం, అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 150 వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అన్ని రూట్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఈ మధ్యే ఆయా రైళ్ల కోచ్ ల సంఖ్యలను కూడా పెంచింది ఇండియన్ రైల్వే. ఎక్కువ మంది ప్రయాణించేలా చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు కొంత వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

త్వరలో 2 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం

ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభమవుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మొదటి రైలు అన్ని పరీక్షలు, ట్రయల్ రన్స్ లో పాసైనట్లు వెల్లడించింది. రెండవ రైలు వచ్చే నెలలో అన్ని పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాత్రిపూట ప్రయాణంలో సాధారణ సేవలను నిర్ధారించడానికి రెండు రైళ్లను కలిపి ప్రారంభించాల్సి ఉందన్నారు.

వందేభారత్ స్లీపర్ రైళ్ల గురించి..

Advertisement

వందేభారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) టెక్నాలజీని ఉపయోగించి BEML తయారు చేసింది. ఈ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిని AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్‌లుగా విభజించారు. ఒక రైల్లో ఒకేసారి 1,128 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఈ రైలు 180 కి.మీ. వేగంతో నడుస్తుంది. ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రాత్రిపూట ప్రయాణాన్ని అందించే రైలు సేవలలో ఒకటిగా మారుతుంది. ఈ రైళ్లను వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

Read Also: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

పండుగ సీజన్ కోసం 12 వేల ప్రత్యేక రైళ్లు

Advertisement

ఇక దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 10 వేల రైళ్లను ప్రకటించామని, 150 పూర్తిగా రిజర్వ్ చేయని రైళ్లను రాపిడ్ కోసం సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈ రైళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు అన్నారు.

Read Also:  వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×