E-Paper
Advertisement

Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. వామ్మో తొలి రోజే అన్ని లక్షలా!

Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. వామ్మో తొలి రోజే అన్ని లక్షలా!
Advertisement

TTD Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఈ-డిప్ కోసం పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 17 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. టీటీడీ వెబ్‌ సైట్, మొబైల్ యాప్, ఏపీ గవర్నమెంట్ వాట్సప్ సహా పలు పద్దతుల ద్వారా ఈ రిజిష్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు (8.51 లక్షల సభ్యులు) నమోదు చేసుకున్నారు.  వెబ్‌ సైట్ ద్వారా 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు (5.75 లక్షల సభ్యులు) రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  వాట్సాప్ ద్వారా 39 వేల రిజిస్ట్రేషన్లు (98 వేల సభ్యులు) నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తొలి మూడు రోజులు టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం

వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు.. అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనం కోసం  1,76,000 టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈ డిప్‌ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు డిసెంబర్ 2న ఫోన్ ద్వారా మెసేజ్ అందుతుంది. తొలి మూడు రోజుల పాటు ఈ డిప్‌ లో టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన ఏడు రోజులు టోకెన్లు లేని భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. ఈ దర్శనానికి సంబంధించి డిసెంబర్ 30న 57 వేలు, 31న 64 వేలు, జనవరి 1న 55 వేల మంది దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ డిప్‌లో టోకెన్లు పొందాలనుకునే భక్తులు డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: అయ్యప్ప భక్తులకు ప్రత్యేక వెసులుబాటు, విమానయాన శాఖ కీలక నిర్ణయం!

 వీఐపీ దర్శనాలు భారీగా తగ్గింపు

వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా వీఐపీ దర్శనాలను భారీగా తగ్గించినట్లు టీటీడీ ప్రకటించింది. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో  వీఐపీ బ్రేక్ కేవలం 4గంటల 45 నిమిషాలకు పరిమితం చేసింది. మిగతా రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6,7,8 తేదీల్లో 5,000 టోకెన్లు అందించనున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ భారీగా ఉండనున్న నేపథ్యంలో, అందుకు తగినట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.

Advertisement

Read Also: పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఆలయాలకు వెళ్లే మూడు ముళ్లు పడిపోతాయ్ అంతే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×