E-Paper
Advertisement

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ లో ఫ్లైట్ రేంజ్ ఫుడ్ సర్వీస్, ప్యాసింజర్స్ ఫిదా!

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ లో ఫ్లైట్ రేంజ్ ఫుడ్ సర్వీస్, ప్యాసింజర్స్ ఫిదా!
Advertisement

Vande Bharat Sleeper Food: భారతీయ రైల్వే ఫుడ్ గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది.  కొందరు ఫుడ్ క్వాలిటీ చాలా బాగుందని అభినందించగా, మరికొంత మంది ఫుడ్ సరిగా లేదని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తరచుగా రైల్వే ఫుడ్ గురించి ఏదో ఒకరంగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఫుడ్ సరఫరాకు సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ప్రయాణీకులు ఏమన్నారంటే..

వందేభారత్ స్లీపర్ లో ఫుడ్ కు ప్యాసింజర్స్ ఫిదా

IRCTC కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో భోజన సర్వీసు గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంది. పూర్తి స్థాయిలో పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తోంది. తాజాగా స్లీపర్ రైలులో ప్రమాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఆన్ బోర్డ్ ఫుడ్ సర్వీస్ కు సంబంధించి వీడియో షూట్ చేస్తూ, విమానంలో భోజన సరఫరాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని కామెంట్స్ చేశాడు.

విమానం తరహాలో ఫుడ్ సప్లై

Advertisement

మార్చి 6న ఇన్‌ స్టాగ్రామ్‌లో ట్రావెల్ వ్లాగర్ ఆదిత్య యాదవ్ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ ఫుడ్ సర్వీసుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో యూనిఫాంలో ఉన్న రైల్వే ఉద్యోగి తన కంపార్ట్‌ మెంట్‌లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సదరు ఉద్యోగి చేతికి గ్లోవ్స్, హెయిర్ నెట్, మాస్క్ ధరించి ఉన్నాడు.  పెద్ద నీలం రంగు ట్రాలీ లోపల ఫుడ్ ను తీసుకొని వచ్చాడు. సీలు వేసిన ఫుడ్ బాక్స్ లను సరఫరా చేస్తున్నాడు. ఆ ట్రాలీ చాలా శుభ్రంగా కనిపిస్తుంది.  రైలు కంపార్ట్‌ మెంట్ కూడా చక్కగా ఎలాంటి మురికి లేకుండా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో రైళ్లలో ఇదే తరహా ఫుడ్ సరఫరా అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

స్థానిక వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత

Advertisement

ఇక వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు స్థానిక వంటకాలను అందిస్తామని భారతీ రైల్వే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఆరు మార్గాలతో ప్రారంభమైంది. నాగ్‌పూర్-సికింద్రాబాద్, సబర్మతి-వెరావల్, శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా-శ్రీనగర్, శ్రీనగర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా, కాసరగోడ్-తిరువనంతపురం, మంగళూరు-తిరువనంతపురం మార్గాల్లో ఈ విధానం అమలు అవుతుంది. ఈ విధానం నెమ్మదిగా భారతీయ రైల్వే నెట్‌ వర్క్ అంతటా విస్తరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

వందేభారత్ స్లీపర్ లో తొలుత ఈ విధానం అమలు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ లో కూడా పైలట్  ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది హౌరా- కామాఖ్య మధ్య నడుస్తుంది. బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ ఇందులో ఎక్కువగా వడ్డిస్తున్నారు.

ఏ ఫుడ్ అందిస్తున్నారంటే?

హౌరా- కామాఖ్య వందేభారత్ స్లీపర్ మెనూలో ఘీ రైస్, బసంతి పులావ్, పచ్చి బఠానీ పులావ్, పరాఠాతో పాటు చోళర్ దాల్,  భాజా మూంగ్ దాల్, మిక్స్ డ్ దాల్ లాంటి కర్రీస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఆప్షన్స్ లో బెంగాలీ చికెన్ కర్రీ, ముర్గ్ రోగిని,  ముర్గిర్ జోల్ ఉన్నాయి. అటు అస్సాంకు సంబంధించి జీరా రైస్, జీరా కార్న్ పులా, కిస్మిస్ పులావ్,  తెహ్దార్ పరాఠాతో పాటు మిక్స్ డ్ దాల్, లెసెరా ఆలూ భాజీ, భెండీ ఆలూ భాజీ, బీన్స్ ఆలూ భాజీ లాంటి కూరగాయల వంటకాలు ఉన్నాయి. నాన్ వెజ్ ఆప్షన్స్ లో అస్సామీ స్టైల్ చికెన్ మసాలా, చికెన్ కర్రీ ఉన్నాయి.

Read Also: వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×