E-Paper
Advertisement

Temple Inside Train: మీకు తెలుసా ఓ రైల్లో ఏకంగా ఆలయం ఉంది, గణపతికి ఓ బెర్తు కూడా ఇచ్చేశారు!

Temple Inside Train: మీకు తెలుసా ఓ రైల్లో ఏకంగా ఆలయం ఉంది, గణపతికి ఓ బెర్తు కూడా ఇచ్చేశారు!
Advertisement

మీరు ఎప్పుడైనా రైల్లో ఆలయం ఉండటం చూశారా? రైల్లో ఆలయం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? తెలియని వాళ్లు నిజంగానే ఆశ్చర్యపోవడం కామన్. కానీ, మన దేశంలోనే ఓ రైల్లో ఏకంగా గణపతికి ఆలయం ఉంటుంది. విఘ్ననాయకుడికి రైల్లో ఓ బెర్త్ కూడా కేటాయించారు రైల్వే అధికారులు. ఇంతకీ ఆ రైలు ఎక్కడ నడుస్తుంది? ఎందుకు ఆ రైల్లో ఆలయం నిర్మించారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్లో గణపతి ప్రతిష్ట

వాస్తవానికి ఇది రెగ్యులర్ రైలు కాదు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు. బీహార్ నుంచి సౌత్ ఇండియాకు వెళ్లే ఓ టూరిస్ట్ రైలు. బీహార్ కు చెందిన పలువురు యాత్రికులు దక్షిణాది పర్యటనకు వెళ్తుండగా, ఓ స్లీపర్ కోచ్ ను చిన్న ఆలయంగా మార్చేశారు. సైడ్ అప్పర్ బెర్త్ లో గణేష్ ప్రతిష్టించారు. ఈ కోచ్ లోపల భజనలు, డ్రమ్స్, సామూహిక ప్రార్థనలతో ఆలయ వాతావరణం నెలకొంది. ఈ ప్రయాణం సుగౌలి నుండి ప్రారంభం అయ్యింది. ఎనిమిది స్లీపర్ కోచ్‌లు, ఒక 3AC కోచ్, ఒక 2AC కోచ్, ఒక ప్యాంట్రీ కార్, రెండు SLR కోచ్‌లు ఉన్నాయి. ఈ పర్యటనలో మొత్తం 464 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు.

ఉదయం, సాయంత్రం హారతి, ప్రార్థనలు

Advertisement

ఇక ఈ రైలులోని స్లీపర్ కోచ్ లోపల, గణేష్ ఆలయం అందంగా అమర్చబడి అలంకరించబడింది. ప్రతి ఉదయం, సాయంత్రం హారతి, ప్రార్థనల కోసం ప్రయాణికులు గుమిగూడి, పాటలు పాడుతూ భక్తిమయంగా మార్చేస్తారు. యాత్ర అంతటా గణేష్ ను స్మరించుకుంటూ ముందుకు సాగుతారు.

జనవరి 18న ప్రారంభమైన యాత్ర

ఈ భారత్ గౌరవ్ యాత్ర జనవరి 18న ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. 14 రాత్రులు, 15 రోజుల పాటు ఈ తీర్థయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు తిరుపతి శ్రీ వేకంటేశ్వరుడు, పద్మావతి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి జ్యోతిర్లింగం, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారి ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం, మల్లికార్జునలోని మల్లికార్జున జ్యోతిర్లింగం, చివరకు పూరిలోని శ్రీ జగన్నాథ్ ధామ్‌ను సందర్శిస్తారు.

Advertisement

ఇక పవిత్ర యాత్రలో భక్తులు తమ కుటుంబాలతో కలిసి వెళ్తున్నారు. నాల్గవ రోజు, భక్తులు తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకుని తదుపరి గమ్యస్థానానికి వెళ్లారు. మొత్తం ప్రయాణం కోసం రైల్వే అధికారులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. పర్యటన అంతటా ప్రయాణీకుల సౌకర్యానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి రోజూ చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు. రోజుకో వెరైటీ పోషకాహారాన్ని ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా పరీక్షించేందుకు ఓ సీనియర్ డాక్టర్ ను అందుబాటులో ఉంచారు.

టికెట్ ధర ఎంత అంటే?

ఇక ఈ యాత్రకు సంబంధించి స్లీపర్ క్లాస్ ఛార్జీ ఒక్కొక్కరికి రూ. 27,535, 3ACకి రూ. 37,500, 2ACకి రూ. 51,405గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో హోటల్ బస, శాకాహార భోజనం, స్థానిక సందర్శనా స్థలాలు, ట్రాన్స్ పోర్ట్, ఆన్‌బోర్డ్ భద్రత, ప్రయాణ బీమాను IRCTC అందిస్తుంది. IRCTC అధికారులు ఈ బృందంతో ప్రయాణిస్తున్నారు.  ప్రయాణీకుల సంరక్షణ, భద్రత, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా కొనసాగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×