E-Paper
Advertisement

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!
Advertisement

Gold in Indian River Sand: బంగారాన్ని గనుల్లో తవ్వి తీస్తారని చాలామందికి తెలుసు. కానీ, మన దేశంలో కొన్ని నదుల్లో కూడా బంగారం దొరుకుంది. ఆ నదుల్లోని ఇసుకలో సహజంగా బంగారు రేణువులు లభిస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ప్రవహించే కొన్ని నదులు ఈ అరుదైన గుర్తింపును కలిగి ఉన్నాయి. అందుకే, ఈ నదుల గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది.

నదిలో బంగారం ఎలా లభిస్తుంది?

నదులు అనేవి సాధారణంగా పర్వతాలు, రాళ్లు, ఖనిజ ప్రాంతాల గుండా ప్రవహించే సమయంలో చిన్న చిన్న ఖనిజ కణాలను తమతో పాటు తీసుకెళ్తాయి. వాటిలో సూక్ష్మ పరిమాణంలో ఉండే బంగారు రేణువులు కూడా ఉంటాయి. ప్రవాహం వేగం తగ్గిన ప్రాంతాల్లో ఈ బంగారు కణాలు ఇసుకతో కలిసి నదీ తీరాల్లో పేరుకుపోతాయి.  ఆ ఇసుకను జల్లెడ పట్టడం ద్వారా చిన్న మొత్తంలో బంగారు రేణువులను సేకరించే అవకాశం ఉంటుంది. బంగారు రేణువులు లభించి ఇండియన్ రివర్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.సువర్ణరేఖ నది

Advertisement

బంగారు రేణువులు లభించే నదుల్లో సువర్ణరేఖ నది ఒకటి. ఈ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.  సువర్ణరేఖ అంటేనే బంగారు గీత అని అర్థం. ఈ నదిలోని ఇసుకలో చాలా కాలంగా బంగారు రేణువులు లభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు తరతరాలుగా నది ఇసుకను జల్లెడ పట్టి చిన్న చిన్న బంగారు కణాలను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు.

2.కర్కరి నది

సువర్ణరేఖకు ఉపనదిగా ఉన్న కర్కరి నదిలో కూడా బంగారు రేణువులు లభిస్తాయి. ఈ నది పరిసర ప్రాంతాల్లోని ఇసుకలో  బంగారు రేణువులు కనిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతాల్లో కొంతమంది ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో ఇసుకను వడకట్టి బంగారం కోసం ప్రయత్నిస్తుంటారు.

3.బ్రహ్మపుత్ర నది

Advertisement

అస్సాం రాష్ట్రంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది కూడా బంగారం లభించే నదుల లిస్టులో పేరు సంపాదించింది. ఈ నదితో పాటు దాని ఉపనదులైన సుబన్‌ సిరి లాంటి నదుల ఇసుకలో కూడా సహజసిద్ధంగా బంగారు రేణువులు ఉన్నట్లు స్థానికులు చెప్తుంటారు. గతంలో ఈ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు నది ఇసుక నుంచి బంగారాన్ని సేకరించేవారని కూడా చెబుతారు.

అయితే, నదిలో బంగారం దొరుకుతుందని విన్న వెంటనే పెద్ద మొత్తంలో బంగారం లభిస్తుందని భావించకూడదు. సాధారణంగా ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉండే బంగారు కణాలు. వాటిని సేకరించడానికి చాలా సమయం, శ్రమ అవసరం. చాలాసార్లు రోజంతా శ్రమించినా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే బంగారం లభించే అవకాశం ఉంటుంది. అయినా, కూడా ప్రకృతి తనలో దాచుకున్న ఈ అరుదైన సంపదను చాలా మంది పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంతో ఈ నదులు భౌగోళికంగా మాత్రమే కాకుండా చారిత్రకంగానూ ప్రత్యేక గుర్తింపు పొందాయి.

Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×