// // Least Happy Countrys: సంతోషకరమైన దేశాలు ఓకే.. సంతోషం లేని దేశాలు ఏవి? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Least Happy Countrys: సంతోషకరమైన దేశాలు ఓకే.. సంతోషం లేని దేశాలు ఏవి?

Least Happy Countrys:  సంతోషకరమైన దేశాలు ఓకే.. సంతోషం లేని దేశాలు ఏవి?
Advertisement

Unhappiest Countries List 2026: ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రపంచ సంతోషకరమైన దేశాల నివేదిక వెల్లడైంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఈ నివేదిక ఆసక్తి కలిగిస్తోంది. ఈ నివేదికలో 2006-2010 నుంచి 2023-2025 నాటికి 79 దేశాలు తమ సంతోష స్థాయిలలో గణనీయమైన పెరుగుదలను సాధించాయి.

ఫిన్లాండ్ వరుసగా 9వ సారి..

ఫిన్లాండ్ వరుసగా 9వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా తన స్థానాన్ని నిలుపుకుంది.   ఫిన్లాండ్ జనాభా 10కి 7.764 లైఫ్ ఎవల్యూషన్ స్కోరును నమోదు చేసింది. 2023లో 23వ స్థానం నుంచి నెమ్మదిగా  పైకి ఎగబాకిన కోస్టారికా, 2026లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం అత్యంత సంతోషకరమైన టాప్ 10 దేశాల జాబితాలో ఐస్‌లాండ్ (2వ), డెన్మార్క్ (3వ), స్వీడన్ (5వ), నార్వే (6వ), ఇజ్రాయెల్ (8వ), లక్సెంబర్గ్ (9వ) స్థానంలో నిలిచాయి. 2025లో 13వ స్థానానికి పడిపోయిన స్విట్జర్లాండ్, తిరిగి 10వ స్థానానికి చేరుకుంది.

భారతదేశం ఏ ప్లేస్ లో ఉందంటే? 

Advertisement

భారతదేశం 2024లో 126వ స్థానం నుండి 2025 నాటికి 118వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇది 10కి 4.536 లైఫ్ ఎవల్యూషన్ స్కోరుతో 116వ స్థానానికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ పై స్థానాలకు చేరడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని అత్యంత సంతోషం లేని  10 దేశాలు

ప్రపంచంలో అత్యంత సంతోషమైన దేశాలతో పాటు సంతోషం లేదని, అసంతృప్తకరమైన 10 దేశాల లిస్టు కూడా విడుదల అయ్యింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో ర్యాంక్ పొందిన 147 దేశాలలో, 1.446 స్కోరుతో ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా నిలిచింది. దాని తర్వాత సియెర్రా లియోన్, మలావి, జింబాబ్వే, బోట్స్వానా, యెమెన్, లెబనాన్, డీఆర్ కాంగో, ఈజిప్ట్, టాంజానియా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ (147), సియెర్రా లియోన్ (146), మలావి (145), జింబాబ్వే (144), బోట్స్వానా (143), ఎస్వాటిని (142వ), లెబనాన్ (141), డీఆర్ కాంగో (140), ఈజిప్ట్ (139వ), టాంజానియా (138వ) స్థానంలో నిలిచాయి.

Advertisement

Read Also: యూనివర్శిటీల్లో వింత కోర్సులు.. ఏంటీ ఇవి కూడా నేర్పిస్తారా? అస్సలు నమ్మలేం!

భారత్ కంటే పాకిస్తాన్ ముందు..

ఇక మన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక వరుసగా 99, 104, 134వ ర్యాంకులను పొందాయి. బంగ్లాదేశ్ 127వ ర్యాంకును పొందింది. నేపాల్, పాకిస్తాన్ కంటే భారత్ వెనుకబడి ఉండటం విశేషం.

Read Also:  ఆ యూనివర్సిటీలో ‘భూత వైద్యం’ కోర్సు.. ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్లు వచ్చాయంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×