E-Paper
Advertisement

Panoramic Train: ఆహా అనిపించే పనోరమిక్ ట్రైన్ జర్నీ, జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిందే!

Panoramic Train: ఆహా అనిపించే పనోరమిక్ ట్రైన్ జర్నీ, జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిందే!
Advertisement

Switzerland Panoramic Train Journey: పనోరమిక్ రైలు ప్రయాణం. అద్భుతమైన ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేసేందుకు పలు దేశాల్లో  అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో పనోరమిక్ రైలు ప్రయాణాలు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ దేశంలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ పనోరమిక్ రైళ్లు నడుస్తున్నాయి. అందులో అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణం గోథార్డ్ పనోరమిక్ ఎక్స్ ప్రెస్ జర్నీ. ఈ రైలు స్విట్జర్లాండ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ, అద్భుతమైన పర్యాటక ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. దేశంలోనే అత్యంత అందమైన రైల్వే మార్గంగా గుర్తింపు తెచ్చుకుంది. లూసర్న్, మాగియోర్ సరస్సులు, అల్ప్స్ పర్వాతాల గుండా ఈ ప్రయాణం ముందుకెళ్తుంది.

లూసెర్న్ నుంచి ప్రయాణం ప్రారంభం

Advertisement

స్విట్జర్లాండ్ లోని సుందరమైన రైలు మార్గాల్లో ఇది ముఖ్యమైనది. గోథార్డ్ రైల్లోని బోగీలు పెద్ద పెద్ద విండోలను కలిగి ఉంటాయి. వీటిలో ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్ సీటింగ్ ను ఎంచుకోవచ్చు. ఈ రైలు సంవత్సరం పొడవునా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. లూసెర్న్‌ నుంచి ఈ రైలు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆర్త్ గోల్డౌ వరకు వెళ్తుంది. మార్గం మధ్యలో అందమైన గ్రామీణ దృశ్యాలతో పాటు చక్కటి లూసెర్న్ సరస్సు కనువిందు చేస్తుంది. ఆ తర్వాత చారిత్రాత్మకమైన గోథార్డ్ మార్గంలో ప్రయాణిస్తుంది. అనేక వంతెనలు, స్పైరల్ సొరంగాల ద్వారా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో వాసెన్‌ లోని చర్చిని 3 వేర్వేరు యాంగిల్స్ లో చూసే అవకాశం ఉంటుంది. గోథార్డ్ టన్నెల్ ను 1882లో ప్రారంభించబడింది. ఇది 19వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఆల్ప్స్  పర్వతాల మీదుగా ప్రయాణం

Advertisement

ఈ రైలు టిసినో ప్రాంతంలోని అందమైన దృశ్యాలు చూసి ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తుంది. నెమ్మదిగా లెవెంటినా లోయకు చేరుకుంటుంది. సుందరమైన జలపాతాలు, ద్రాక్షతోటలు, ఇటాలియన్ శైలి భవనాలు ఆకట్టుకుంటాయి. బెల్లిన్జోనాకు చేరుకున్న తర్వాత ఈ ట్రైన్ ఆల్ప్స్ పర్వతాల మీదుగా కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యయుగం నాటి అనేక కోటలు దర్శనం ఇస్తాయి. చివరగా ఈ రైలు ఇటాలియన్ శైలి గ్రామీణ ప్రాంతాల గుండా, మెరిసే మాగియోర్ సరస్సు ఒడ్డున ఉన్న లోకార్నోకు తీసుకెళుతుంది.

సుమారు 5 గంటల ప్రయాణం

గోథార్డ్ పనోరమిక్ రైలు ప్రయాణం సుమారు 4 నుంచి 5 గంటల పాటు కొనసాగుతుంది. ఈ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని అనుభూతులను కలిగిస్తుంది. చారిత్రాత్మక భవనాలతో కూడిన నగరాల గుండా, లోతైన నీలి సరస్సుల వెంట వెళుతుంది. ఆ తర్వాత దేశంలోని కొన్ని ప్రఖ్యాతి చెందిన పర్వత శిఖరాలను పక్క నుంచి కొనసాగుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన బెల్లింజోనా కోటలను చూసే అవకాశం ఉంటుంది. మధ్యధరా శైలి లోకార్నో నగరంలోలో ఈ ప్రయాణం ముగుస్తుంది. స్విట్జర్లాండ్ లోని ఈ ప్రాంతాన్ని, ‘సూర్యుడు ముద్దు పెట్టుకునే మూల’ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాన్ని చేయాలనకుంటారు.

Read Also: రైలు వస్తుందంటే.. అక్కడ విమానాలు ఆపేస్తారు, విడ్డూరం కాదు అవసరం!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×