E-Paper
Advertisement

Railway Stations: ఒకే రాష్ట్రంలో 1000కిపైగా రైల్వే స్టేషన్లు.. నిజంగా ఇదో వండర్!

Railway Stations: ఒకే రాష్ట్రంలో 1000కిపైగా రైల్వే స్టేషన్లు.. నిజంగా ఇదో వండర్!
Advertisement

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంగా దేశ వ్యాప్తంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. రైల్వే స్టేషన్లు అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. అమృత్ స్టేషన్ లో భాగంగా అన్ని రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టు మాదిరి సౌకర్యాలతో పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా రైల్వే స్టేషన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దేశ వ్యాప్తంగా విస్తృతమైన రైల్వే నెట్ వర్క్

దేశ వ్యాప్తంగా విశాలమైన రైల్వే నెట్‌ వర్క్ ప్రధాన నగరాలు, చిన్న పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలను కలుపుతుంది. ఇది ప్రయాణీకులు, సరుకుల రవాణాకు మంచి సపోరర్టు ఇస్తుంది. ఈ రైల్వే నెట్ వర్క్ దేశ ఆర్థిక,  సామాజిక రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్న రాష్ట్రం!

Advertisement

రైల్వే సమాచారం ప్రకారం దేశంలో అత్యధిక రైల్వే స్టేషన్లు కలిగిన రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర  వ్యాప్తంగా సుమారు 1000కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణీకులు రైల్వే ప్రయాణం చేస్తున్నారు. ఇక యూపీలో ప్రయాగ్‌ రాజ్ జంక్షన్ రాష్ట్రంలోని కీలకమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ స్టేషన్ నుంచి పెద్ద మొత్తంలో ప్రయాణీకులతో పాటు సరుకులను రవాణా చేస్తుంది.

Read Also:  తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, కళ్లు చెదిరేలా మారబోతున్న4 రైల్వే స్టేషన్లు!

లక్షలాది మందికి ప్రయాణం..  వేలాది మందికి ఉపాధి

Advertisement

ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. యూపీ నుంచి ఎంతో మంది దేశ వ్యాప్తంగా ప్రయాణాలు చేస్తారు. ఉత్తర ప్రదేశ్ రైల్వే వ్యవస్థ దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. వెయ్యికి పైగా రైల్వే స్టేషన్లు ఉన్న నేపథ్యంలో వేలాది మందికి ప్రత్యక్ష, లక్షలాది మందికి పరోక్ష ఉపాధి కలుగుతుంది. అదే సమయంలో భారతీయ రైల్వేకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. మొత్తంగా భారతీయ రైల్వేలో ఎక్కువ నెట్ వర్క్ తో పాటు ఎక్కవ రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read Also:  వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×