E-Paper
Advertisement

No Railway Line: అక్కడి ప్రజలకు రైలు అంటే తెలియదు, కారణం ఏంటంటే?

No Railway Line: అక్కడి ప్రజలకు రైలు అంటే తెలియదు, కారణం ఏంటంటే?
Advertisement

India’s Only State Without Railway Connectivity: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడో ఓ చోట రైల్వే లైన్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేశంలోని ప్రతి మూల మూలకు  రైల్వే విస్తారించింది. సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారిలో చాలా మంది రైల్వేలను ఎంచుకుంటారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క రైల్వే లైన్ లేని రాష్ట్రం ఒకటి ఉంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? ఎందుకు అక్కడ ఇప్పటికీ రైల్వే లైన్లు నిర్మించలేదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటికీ రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం  

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు దాటినా ఓ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రైల్వే లైన్ కూడా లేదు. ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి కూడా రైలు కూత వినలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు సిక్కిం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే లైన్ లేదు. ఇక్కడి ప్రజలకు రైలు ప్రయాణం గురించి పెద్దగా తెలియదు. సిక్కిం ప్రజలు రైలు ప్రయాణం చేయాలి అనుకుంటే పక్కనే ఉన్న బెంగాల్ కు వెళ్లాల్సి ఉంటుంది. సిక్కిం సరిహద్దులోని సిలిగురి, జల్పాయ్ గురి రైల్వే స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కాల్సి ఉంటుంది?

సిక్కింలో రైల్వే లైన్లు ఎందుకు లేవు?

Advertisement

సిక్కింలో రైల్వే లైన్ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు రైల్వే లైన్లకు అనుకూలంగా లేవు. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఎత్తైన పర్వతాల మీద ఉంటుంది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎక్కువగా పర్వాతలు, లోయలు ఉంటాయి. ఇలాంటి క్లిష్ట ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేయడం అనేది సవాల్ తో కూడిన వ్యహారం. చివరకు బెంగాల్, సిక్కిం రాష్ట్రంతో కలిపేందుకు సివోక్-రాంగ్ పో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా ఉండే అభయారణ్యాలతో పాటు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో  ప్రాజెక్టు అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐక్రాన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ నిర్మాణ పనులు చేపడుతోంది.

త్వరలో అందుబాటులోకి రైల్వే లైన్

సివోక్‌-రాంగ్‌పో రైల్వే లైన్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రైలు మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా రైల్వే ట్రాక్ కు ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చుతున్నారు. మొత్తంగా త్వరలో సిక్కిం ప్రజలు రైలు కూత వినబోతున్నారు. ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే రైల్వే శాఖ ఈ లైన్ ప్రారంభోత్సవానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also: రంగు రంగుల రైళ్లు.. ఒక్కో కలర్ వెనక ఒక్కో కథ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×