E-Paper
Advertisement

60 రోజుల ఫ్రీ ఎంట్రీ క్యాన్సిల్.. ఇక థాయ్‌లాండ్‌కు వెళ్లాలంటే వీసా ఉండాల్సిందే!

60 రోజుల ఫ్రీ ఎంట్రీ క్యాన్సిల్.. ఇక థాయ్‌లాండ్‌కు వెళ్లాలంటే వీసా ఉండాల్సిందే!
Advertisement

Thailand Visa Update 2026: థాయ్‌ లాండ్‌ ప్రభుత్వం కొత్త వీసా నిబంధనలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయులకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 60 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ విధానాన్ని థాయ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై భారతీయులు థాయ్‌ లాండ్‌ కు వెళ్లాలంటే వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. థాయ్‌ లాండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత పర్యాటకులపై తీవ్రంగా పడనుంది.

93 దేశాల పర్యాటకులకు 60 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ

గతంలో థాయ్‌లాండ్ భారతదేశంతో పాటు 93 దేశాల పర్యాటకులకు 60 రోజుల వీసా రహిత ప్రవేశాన్ని ఇచ్చింది. 2024 జూలైలో ఈ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. అదనంగా 30 రోజులు పొడిగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. దీంతో భారతీయులు ఎక్కువ కాలం సెలవులు గడపడానికి థాయ్‌ లాండ్‌ ను ఎంచుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ విధానంలో కీలక మార్పలు చేసింది. మే 19న థాయ్‌ లాండ్ క్యాబినెట్ కొత్త వీసా విధానానికి ఆమోదం తెలిపింది. ఒక దేశం – ఒక వీసా సౌకర్యం అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని  ప్రకారం ప్రతి దేశానికి ఒకే వీసా కేటగిరీ మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పులు అధికారికంగా రాయల్ గెజెట్‌ లో ప్రచురించిన 15 రోజుల తర్వాత అమల్లోకి రానున్నాయి.

60 రోజుల వీసా-ఫ్రీ విధానం పూర్తిగా రద్దు

Advertisement

కొత్త నిబంధనల ప్రకారం 60 రోజుల వీసా ఫ్రీ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. 30 రోజుల వీసా మినహాయింపు పొందే దేశాల సంఖ్యను కూడా తగ్గించారు. అలాగే వీసా ఆన్ అరైవల్ జాబితాను భారీగా కుదించారు. ప్రస్తుతం కేవలం నాలుగు దేశాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉండనుంది. వాటిలో భారతదేశం కూడా ఒకటి.

ఇకపై వీసా లేకుండా థాయ్ లాండ్ కు నో ఎంట్రీ

దీంతో భారతీయులకు ఇకపై వీసా లేకుండా థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.  అక్కడి విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ చెక్‌ పాయింట్ల దగ్గర వీసా ఆన్ అరైవల్ తీసుకోవాలి. ఈ విధానం కింద గరిష్టంగా 15 రోజుల పాటు మాత్రమే థాయ్‌ లాండ్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. సో, ఎక్కువ రోజులు సెలవులు ప్లాన్ చేసే వారికి ఇది కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

థాయ్ సర్కారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

Advertisement

థాయ్‌ లాండ్ ప్రభుత్వం ఈ మార్పులకు భద్రతా కారణాలను చూపుతోంది. అక్రమ ఉపాధి, నకిలీ వ్యాపారాలు, అంతర్జాతీయ నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పర్యాటకుల సంఖ్య కంటే  నిజమైన పర్యాటకులను  ఆకర్షించడంపైనే ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టినట్లు థాయ్‌ లాండ్ టూరిజం మంత్రి వెల్లడించారు. అయితే, ఇప్పటికే థాయ్‌ లాండ్‌ లో ఉన్నవారికి, కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ప్రయాణం ప్లాన్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారికి పాత నిబంధనల ప్రకారమే అనుమతి కొనసాగుతుంది. భారతీయ పర్యాటకులు ఇప్పుడు థాయ్‌ లాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు తాజా వీసా నిబంధనలు తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది.

Read Also: మండే ఎండలతో అల్లాడుతున్నారా? కూల్ గా అలా హిమాలయాలను చుట్టేసి రండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×