E-Paper
Advertisement

TG Vehicle Registration: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ‘బంపర్ ఆఫర్’.. ఇకపై పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఈజీ!

TG Vehicle Registration: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ‘బంపర్ ఆఫర్’.. ఇకపై పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఈజీ!
Advertisement

TG Vehicle Registration: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. వాహనదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రజలు ఆర్టీఓ (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

గతంలో కొత్త వాహనం కొన్నప్పుడు కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే షోరూమ్ వద్ద జరిగేది. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ.. తాజాగా వాహనం కొన్న షోరూమ్ వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్యాలయాల్లో దళారుల బెడద కూడా తప్పుతుంది.

Advertisement

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సారథి (Sarathi)లో చేరడంతో రవాణా సేవలు మరింత సులభం కానున్నాయి. ప్రస్తుతం రవాణా శాఖకు సంబంధించిన దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ కార్డుల జారీ నుంచి పర్మిట్ల వరకు అన్నీ డిజిటల్ మయం కావడంతో, ప్రజలు ఇంటి నుండే తమ పనులను పూర్తి చేసుకోవచ్చు.

రవాణా శాఖ కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ (Electric Vehicle) పాలసీ, స్క్రాప్ పాలసీని కూడా పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పించడం. పాతబడిన, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను స్వచ్ఛందంగా తొలగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు.

Advertisement

రవాణా శాఖలో చేపట్టిన ఈ ఆధునిక మార్పులు ప్రజలకు సేవలను మరింత చేరువ చేశాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. పారదర్శకమైన, వేగవంతమైన రవాణా సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ALSO READ:తల్లిదండ్రులే భారమయ్యారా? ఆస్తి కోసం అరాచకం చేసిన కొడుకుపై అధికారుల కొరడా

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×