E-Paper
Advertisement

Railyway Station In India: మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!

Railyway Station In India: మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!
Advertisement

Railyway Station In India: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలకు పేరుంది. నిత్యం కోట్లాది మంది ప్రయాణించే రైళ్లను.. ప్రజల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూనే ఉన్నారు. రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వందే భారత్ స్లీపర్, వందేభారత్ సీటర్ రైళ్లల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, కొత్తగా అప్ గ్రేడ్ చేస్తున్న రైల్వే స్టేషన్ లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి నిత్యం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అలాంటిది ఈ దేశంలో ఓ స్టేషన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే రైళ్లలో అనూహ్యంగా లైట్లు ఆరిపోతుండటం షాక్ కు గురిచేస్తోంది.

ఆ స్టేషన్ ఎక్కడ ఉందంటే?

Advertisement

తమిళనాడు చెన్నైకి సమీపంలోని తాంబరం రైల్వే స్టేషన్ గురించి.. నెట్టింట పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు తమకు ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ గుండా ప్రయాణిస్తున్న రైళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడి.. లైట్లు ఆరిపోతున్నట్లు తరుచూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు సైతం ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతున్నట్లు సమాచారం.

లైట్లు ఆరడానికి కారణాలేంటి?

Advertisement

తాంబరం (Tambaram) రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే సబర్బన్ లోకల్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ లో ఇలా కొద్దిసేపు లైట్లు, ఫ్యాన్లు ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి న్యూట్రల్ సెక్షన్ (Neutral Section) అనే టెక్నికల్ విభాగం కారణమవుతున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా భారతీయ రైల్వేలో ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్ (OHE – Overhead Equipment)ను వివిధ పవర్ సప్లై జోన్లుగా విభజిస్తారు. రెండు జోన్ల మధ్యలో న్యూట్రల్ సెక్షన్ అనే చిన్న భాగం ఉంటుంది. ఇది రెండు వేర్వేరు ఫేజ్‌ల (phases) నుంచి వచ్చే విద్యుత్ సప్లై మధ్య షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంటుంది. అయితే తాంబరం స్టేషన్ వద్ద ఈ న్యూట్రల్ సెక్షన్ చిన్నగా ఉండటం వల్ల లోకల్ ట్రైన్స్ ఒక జోన్ నుంచి మరో జోన్ కు మారినప్పుడు ప్యాంటో గ్రాఫ్ ద్వారా విద్యుత్ తాత్కాలికంగా డిస్ కనెక్ట్ అవుతోంది. దీని వల్ల రైలులో 5-10 సెకన్ల పాటు లైట్లు ఆరిపోతున్నట్లు రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. కాబట్టి ప్రయాణికులు భావిస్తున్నట్లుగా ఇందులో ఎలాంటి మిస్టరీ లేదని.. ఒక చిన్న సాంకేతిక సమస్య మాత్రమేనని పేర్కొంటున్నారు.

Also Read: Oppo Find N6, Honor Magic V6: గెట్ రెడీ బ్రో.. సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాలు!

రైల్వే స్టేషన్ల ప్రత్యేకత!

ఇదిలా ఉంటే దేశంలోని పలు రైల్వే స్టేషన్లు తమకుంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. కొన్ని రైళ్లు అత్యధికంగా రైల్వే ఫ్లాట్ ఫామ్స్ ను కలిగి ఉంటే మరికొన్నింటిలో అసలు ఫ్లాట్ ఫామ్ లే లేకపోవడం గమనార్హం. భారత దేశంలో ఏ విధంగా అయితే సాంస్కృతిక వైవిధ్యం ఉందో.. అదే విధంగా రైల్వే స్టేషన్స్ సైతం విభిన్న పరిస్థితులు, ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్.. తన విక్టోరియన్ గోతిక్ డిజైన్ తో ప్రశంసలు అందుకుంటోంది. అలాగే లక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ దాని సౌండ్ ప్రూఫ్ ఇంజనీరింగ్ తో ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోని రైల్వే స్టేషన్స్ ఏదో విధంగా ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాయి.

Also Read: TDP vs YSRCP: అంబటి కోసం వెళ్లి.. చిక్కులు కొనితెచ్చుకున్న జగన్.. మళ్లీ బుక్కయ్యారుగా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×