E-Paper
Advertisement

Traffic Challans: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా? అయితే, మీకో గుడ్ న్యూస్!

Traffic Challans: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

Pending Traffic Challans: వాహనదారులు తరచుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేస్తుంటారు. చాలా మంది వాహనదారులు తమ చలాన్లను పెద్దగా పట్టించుకోరు. కొంత మంది అసలు తన బండ్ల మీద చలాన్లు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. మరికొంత మంది వాహనాల మీద పెద్ద సంఖ్యలో చలాన్లు ఉన్నా, కట్టకుండా అలాగే వదిలేస్తారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండవ వారంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబోతోంది. డిస్కౌంట్లను అందించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించే అవకాశం కల్పించనుంది.

లోక్ అదాలత్ లో ఏ ఉల్లంఘనలు పరిష్కరించుకోవచ్చంటే?  

లోక్ అదాలత్ లో పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. పరిష్కారాలని అర్హత కలిగిన ఉల్లంఘనలు ఏవంటే..

Advertisement

⦿ హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం

⦿ రెడ్ సిగ్నల్ జంప్ చేయడం

Advertisement

⦿ సాధారణ ఓవర్ స్పీడ్

⦿ రాంగ్ పార్కింగ్

⦿ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం

⦿ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం

⦿ నంబర్ ప్లేట్లు లేకపోవడం

⦿ ఫిట్‌ నెస్ సర్టిఫికెట్ లేకపోవడం

⦿ తప్పుగా జారీ చేసిన చలాన్లు

⦿ పాత పెండింగ్‌ చలాన్లు

Read Also: సోషల్ మీడియా.. ఇంత చెత్తలో మనం బతుకుతున్నామా? సిగ్గుండాలి!

లోక్ అదాలత్ లో పరిష్కారం కాని కేసులు

అటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని కేసులను లోక్ అదాలత్ నుంచి మినహాయించారు. తీవ్రమైన కేసులను ఈ పరిధిలోకి తీసుకురావడం లేదు. అవేంటంటే..

⦿ మద్యం సేవించి వాహనం నడపడం

⦿ హిట్ అండ్ రన్

⦿ ర్యాష్ డ్రైవింగ్

⦿ రోడ్డు ప్రమాదం(గాయాలు, మృతి) లాంటి తీవ్రమైన ఉల్లంఘటనలకు ఈ మినహాయింపు వర్తించదు.

డిసెంబర్ 21న లోక్ అదాలత్

తెలంగాణలో డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ మేరకు  తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ తన వెబ్ సైట్ లో ప్రకటించింది. అయితే, పెండింగ్‌ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: అరే మీరు స్నేహితులేనా? ఫ్రెండ్ బర్త్ డే కేకులో బాంబులు పెట్టి..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×