E-Paper
Advertisement

ఇళ్లు ఫ్రీ.. ఉద్యోగం కూడా ఇచ్చేస్తారట.. యూరప్‌ విలేజ్ క్రేజీ ఆఫర్!

ఇళ్లు ఫ్రీ.. ఉద్యోగం కూడా ఇచ్చేస్తారట.. యూరప్‌ విలేజ్ క్రేజీ ఆఫర్!
Advertisement

Dream Life in Europe: చాలా మంది యూరప్ లో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. అయితే, స్పెయిన్ లోని ఓ విలేజ్ అలాంటి వారికి క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఉచితంగా ఇల్లు, ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. అరెనిల్లాస్ అనే చిన్న గ్రామం ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఉదయం లేస్తే చుట్టూ కొండలు, ప్రశాంత వాతావరణం, ట్రాఫిక్ రభస లేని జీవితం అనేది చాలా మందికి కలలా ఉంటుంది. అలాంటి లైఫ్ స్టైల్ కోరుకునేవారికి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే, ఇది కేవలం ఫ్రీ హాలిడే కోసం కాదు. కొన్ని ముఖ్యమైన షరతులతో కూడిన ఆఫర్.

ఈ గ్రామంలో జనాభాను పెంచేలని నిర్ణయం

అరెనిల్లాస్ గ్రామం సోరియా ప్రాంతంలో ఉన్న ఒక చిన్న, దూర ప్రాంతం. అక్కడ ప్రస్తుతం సుమారు 40 మంది మాత్రమే నివసిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా యువత నగరాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామం ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు స్థానిక అధికారులు కొత్త కుటుంబాలను ఆకర్షించేందుకు ఉచిత ఇల్లు, ఉద్యోగం లాంటి ఆఫర్లు ప్రకటించారు. అయితే, ఈ ఆఫర్ పొందేందుకు కొన్ని కండీషన్లను పెట్టింది లోకల్ గవర్నమెంట్. ముఖ్యంగా కుటుంబంతో కలిసి అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్లిన తర్వాత శాశ్వతంగా నివసించాలి. గ్రామంలో ఒక బార్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మున్సిపల్ పనుల్లో కూడా భాగస్వామ్యం కావాలి. అంటే కేవలం సౌకర్యాల కోసం వెళ్లడం కాదు, గ్రామ అభివృద్ధిలో భాగం కావాలి.

ఉచితంగా రినోవేట్ చేసి నివాసం

Advertisement

ఇళ్ల విషయానికి వస్తే, ఇప్పటికే రినోవేట్ చేసిన కొన్ని ఇళ్లలో ఒకటి ఉచితంగా ఇస్తారు. మిగతా ఇళ్లకు తక్కువ అద్దె ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ తీసుకునే వారికి మాత్రమే ఈ సౌకర్యాలు అందిస్తారు. ఈ ఆఫర్ ప్రకటించగానే వారం రోజుల్లోనే వందకు పైగా దరఖాస్తులు రావడం ఆసక్తికరంగా ఉంది.

అక్కడ జీవితం ఈజీయేనా?

నిజానికి అక్కడ నివాసం అంత ఈజీ కాదు. రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. సొంత వాహనం అవసరం. పిల్లల స్కూల్ కూడా దూరంగా ఉంటుంది. వైద్య సదుపాయాలు కూడా ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో సమీప పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉండవు. గ్రామంలో చేసే పనులు ప్రధానంగా శారీరక శ్రమతో కూడుకున్నవే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆఫర్‌ లో వీసా ఇవ్వరు. స్పెయిన్‌లో ఉండటానికి, పని చేయటానికి అవసరమైన వీసా ఇప్పటికే ఉండాలి. లేకపోతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కష్టమే.

Advertisement

ప్రశాంతమైన గ్రామీణ జీవితం కోరుకునేవారికి ఇది మంచి ఛాన్స్. కానీ, నగర సౌకర్యాలకు అలవాటు పడిన వారికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని తీసుకునే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించుకోవడం చాలా ముఖ్యం.

Read Also: వామ్మో.. ఏకంగా 27వ అంతస్తు నుంచి పాక్కుంటూ దిగిపోయిన 89 ఏళ్ల బామ్మ

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×