// // Trains Cancelled: ఏపీ వెళ్తున్నారా ? 15కు పైగా రైళ్ల రద్దు, పూర్తి లిస్ట్ ఇదే! -->
E-Paper
Advertisement

Trains Cancelled: ఏపీ వెళ్తున్నారా? 15కు పైగా రైళ్ల రద్దు, పూర్తి లిస్ట్ ఇదే!

Trains Cancelled: ఏపీ వెళ్తున్నారా? 15కు పైగా రైళ్ల రద్దు, పూర్తి లిస్ట్ ఇదే!
Advertisement

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ – వైజాగ్ సెక్షన్‌లో అత్యవసర భద్రతా, మరమ్మతులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక ఎక్స్‌ప్రెస్ , ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు ఈ మార్పులు అమలులో ఉంటాయి. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి వంటి ప్రధాన రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందే సరిచూసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

విజయవాడ-వైజాగ్ మార్గంలో రైళ్ల రద్దు: పూర్తి వివరాలు..

Advertisement

1. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718/12717): విజయవాడ, వైజాగ్ మధ్య అత్యంత ఆదరణ పొందిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 29, 31 తేదీల్లో రెండు వైపులా రద్దు చేయబడింది. ఈ రైలు రద్దు కావడం వల్ల నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

2. సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/17240): గుంటూరు నుంచి వైజాగ్ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) జనవరి 28 నుంచి 30 వరకు, తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి గుంటూరు వచ్చే రైలు (17240) జనవరి 29 నుంచి 31 వరకు రద్దు చేసారు.

Advertisement

3. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806/12805): లింగంపల్లి (హైదరాబాద్) నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806) జనవరి 29, 30 తేదీల్లో, విశాఖ నుంచి లింగంపల్లి వచ్చే రైలు (12805) జనవరి 28, 29 తేదీల్లో నడవదు.

4. తిరుపతి – పూరి – తిరుపతి (17480/17479): తిరుపతి నుంచి పూరి వెళ్లే రైలు జనవరి 27న, తిరుగు ప్రయాణంలో పూరి నుంచి తిరుపతి వచ్చే రైలు జనవరి 28న రద్దు చేసారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే యాత్రికులు ఈ విషయాన్ని గమనించాలి.

5. తిరుపతి – వైజాగ్ ఏసీ డబుల్ డెక్కర్ (22708/22707): తిరుపతి, వైజాగ్ మధ్య నడిచే ఈ ప్రీమియం రైలు జనవరి 29న రెండు వైపులా రద్దు చేసారు.

6. మచిలీపట్నం – వైజాగ్ (17219/17220): మచిలీపట్నం నుంచి విశాఖ వెళ్లే రైలు (17219) జనవరి 28, 29 తేదీల్లో, విశాఖ నుంచి మచిలీపట్నం వచ్చే రైలు (17220) జనవరి 29, 30 తేదీల్లో రద్దు చేసారు.

7. రాజమండ్రి – వైజాగ్ ప్యాసింజర్ (67285/67286): స్థానిక ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఈ మెము రైళ్లు జనవరి 29, 31 తేదీల్లో రద్దు చేసారు.

8. గుంటూరు – వైజాగ్ సూపర్ ఫాస్ట్ (22876/22875): ఈ రైళ్లు జనవరి 31న రెండు వైపులా రద్దు చేసారు.

Also Read: ఐఆర్సీటీసీ ఫుడ్ ధరల లిస్ట్ ఇదే.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాస్ట్ ఏంతో తెలుసా?

ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రైళ్ల రద్దు వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ క్రింది సూచనలు పాటించండి.

టికెట్ రీఫండ్: రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ఆన్‌లైన్ టికెట్లకు పూర్తి మొత్తం ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతుంది. కౌంటర్ టికెట్లు ఉన్నవారు స్టేషన్ వద్ద రీఫండ్ పొందవచ్చు.

ప్రత్యామ్నాయ ప్రయాణం: రద్దు చేసిన రైళ్లకు బదులుగా ఆర్టీసీ అదనపు బస్సులను నడిపే అవకాశం ఉంది. ప్రైవేట్ వెహికిల్స్ బస్సులను ముందే బుక్ చేసుకోవడం శ్రేయస్కరం.

గమనిక: ఈ వివరాలను రైల్వే అధికారిక వెబ్ సైట్లు, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మరోసారి సరిచూసుకోగలరని మనవి. 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×