E-Paper
Advertisement

Special Trains: హైదరాబాద్-ముంబై మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణీకులకు SCR గుడ్ న్యూస్!

Special Trains: హైదరాబాద్-ముంబై మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణీకులకు SCR గుడ్ న్యూస్!
Advertisement

South Central Railway Special Trains: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు సర్వీసులను నడిపిస్తుంది. అందులో భాగంగానే నూతన సంవత్సర రద్దీ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-ముంబై నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

డిసెంబర్ 28,29 తేదీల్లో ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్- LTT ముంబై మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 07458, 07459 రైళ్లు డిసెంబర్ 28, 29 తేదీలలో నడుస్తాయని తెలిపారు. ఈ రైళ్లు ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో AC, స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

రైల్వే విడుదల చేసిన ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ప్రకటనలో  రైలు నంబర్ 07458 హైదరాబాద్ – LTT ముంబై డిసెంబర్ 28న సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు ముంబైకి చేరుకుంటుందని ఇండియన్ రైల్వే తెలిపింది. అటు రైలు నంబర్ 07459 LTT ముంబై – హైదరాబాద్ డిసెంబర్ 29న మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Read Also: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..

ప్రత్యేక రైళ్లు  ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

Advertisement

డిసెంబర్ 28, 29 తేదీల్లో నడిచే ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కలబురగి, షోలాపూర్, పూణే, కళ్యాణ్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. నూతన సంవత్సర ప్రయాణాలు చేయాలనుకునే ప్యాసింజర్లు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.

Read Also: ఇకపై సెల్ ఫోన్లలో టికెట్లు చూపించకూడదట, రైల్వే షాకింగ్ డెసిషన్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×