E-Paper
Advertisement

వందేభారత్ ఫుడ్ సేఫ్ కాదా? భయపెడుతున్న తాజా ల్యాబ్ రిపోర్ట్!

వందేభారత్ ఫుడ్ సేఫ్ కాదా?  భయపెడుతున్న తాజా ల్యాబ్ రిపోర్ట్!
Advertisement

IRCTC Food Controversy: ఇటీవల భారతీయ రైల్వే ఫుడ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ప్రయాణ సమయంలో అందించే భోజనం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. దీనికి కారణం, తాజాగా ఓ ప్రైవేట్ టెస్టింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక. ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలో, IRCTC ద్వారా అందించే భోజనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ఇంతకీ ల్యాబ్ రిపోర్టులో ఏం తేలిందంటే?

తాజాగా సదరు సంస్థ విడుదల చేసిన వీడియోలో.. ఈ పరీక్షలను బ్లైండ్ ల్యాబ్ టెస్టింగ్ పద్ధతిలో నిర్వహించారు. అంటే, నమూనాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా పరీక్షించడం జరిగింది. ఈ విధానం వల్ల ఫలితాలు మరింత నిష్పక్షపాతంగా ఉంటాయని చెబుతారు. ఈ పరీక్షల్లో పప్పు, జీరా రైస్, పనీర్ లాంటి వంటకాల్ని పరిశీలించారు. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వంటకాలలో బ్యాక్టీరియా స్థాయి పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించారు. సాధారణంగా ఆహారంలో ఉండే బ్యాక్టీరియా పరిమాణం నిర్దిష్ట స్థాయిలో ఉండాలి. అయితే, ఈ పరీక్షల్లో ఆ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. దీని వల్ల ఆహార పరిశుభ్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్స్

Advertisement

వందేభారత్ ఫుడ్ కు సంబంధించి అన్ని పరీక్షల్లో ప్రతికూల ఫలితాలే రాలేదు. ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలో మరో విషయం కూడా స్పష్టమైంది. అఫ్లాటాక్సిన్లు, భార లోహాలు లాంటి ప్రమాదకర పదార్థాల కోసం చేసిన పరీక్షల్లో మాత్రం ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. అంటే, కొన్ని ప్రమాదకర పదార్థాలు పరిమితికి లోబడి ఉన్నట్లు వెల్లడించారు.

రైల్వే ఫుడ్ పై ప్రయాణికులలో ఆందోళన

తాజా రిపోర్టు బయటకు రావడంతో రైలు ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే వారు ఎక్కువగా ట్రైన్‌లో అందించే భోజనంపైనే ఆధారపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆహారం సురక్షితం కాదనే భావన కలగడం సహజం. ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. నిజానికి  గతంలో కూడా IRCTC ఆహారంపై ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సదరు క్యాటరింగ్ సంస్థలపై చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి.

Advertisement

ఈ పరిణామాలన్నింటిని చూస్తే, రైల్వే ఆహార నాణ్యతపై మరింత కఠిన నియంత్రణ అవసరం అని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు క్రమం తప్పకుండా జరపాలంటున్నారు. అలాగే, క్యాటరింగ్ సంస్థలు కూడా నాణ్యతపై రాజీ పడకూడదంటున్నారు. భవిష్యత్తులో రైల్వే ఫుడ్ విషయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితమైన ప్రమాణాలు పాటించడం, క్రమమైన తనిఖీలు చేయడం చాలా అవసరం. ప్రయాణికులు కూడా తమ ఆహారంపై ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయడం మంచిదంటున్నారు అధికారులు.

Read Also: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×