E-Paper
Advertisement

Shillong Tourism: ఈ సమ్మర్‌లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!

Shillong Tourism: ఈ సమ్మర్‌లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!
Advertisement

Shillong Tourism: ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుండే కొండలు.. కంటికి రెప్పలా అడ్డుపడే మేఘమాలలు.. జలజల పారే జలపాతాల మధ్య విహరించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా సందర్శించాల్సిన ప్రాంతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్. బ్రిటీష్ కాలం నుండే స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలవబడే ఈ నగరం.. ఈశాన్య భారత దేశపు పర్యాటక కిరీటంలో ఒక మణిహారం. అసలు షిల్లాంగ్‌లో ఉన్న ప్రత్యేకతలేంటి? అక్కడ చూడాల్సిన అద్భుత ప్రదేశాలేవి? సమ్మర్‌లో అక్కడికి వెళ్తే లాభాలేంటి..?

నిరంతరం మేఘాలతో ముద్దులాడే షిల్లాంగ్

సముద్ర మట్టానికి సుమారు 1,496 మీటర్ల ఎత్తులో.. నిరంతరం మేఘాలతో ముద్దులాడే నగరం షిల్లాంగ్. దీనిని మేఘాల నిలయం అని అందుకే అంటారు. ఇక్కడి చల్లని వాతావరణం, పైన్ వృక్షాల అడవులు, అడుగడుగునా కనిపించే ప్రకృతి అందాలు పర్యాటకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఈశాన్య భారత దేశంలో సంగీతానికి, విద్యకు కేంద్ర బిందువైన ఈ నగరం.. ఆధునికతను, సంప్రదాయాన్ని మేళవించుకున్న అరుదైన పట్టణం.

నీలి జలాల పలకరింపు

Advertisement

షిల్లాంగ్ ప్రయాణంలో పర్యాటకులను మొదటగా పలకరించేది ఉమియం లేక్. దీనిని స్థానికంగా బారా పానీ అని కూడా పిలుస్తారు. నీలి రంగులో మెరిసిపోయే ఈ భారీ జలాశయం చుట్టూ ఉన్న కొండలు పర్యాటకులకు కంటికి విందు చేస్తాయి. ఇక్కడ కేవలం ప్రకృతిని చూడటమే కాదు.. వాటర్ స్కీయింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలతో యువత కేరింతలు కొడుతుంటారు. ఉమియం లేక్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే.. పాలను నురుగులా ప్రవహించే ఎలిఫెంట్ ఫాల్స్ దర్శనమిస్తుంది. మూడు అంచెలుగా పడే ఈ జలపాతం హోరు పర్యాటకులను మైమరిపిస్తుంది. బ్రిటీష్ వారు ఇక్కడ ఉన్న ఒక రాయి ఏనుగు ఆకారంలో ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. వర్షాకాలం తర్వాత ఈ జలపాతం తన పూర్తి స్థాయి సౌందర్యంతో పర్యాటకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

నింగిని తాకే షిల్లాంగ్ పీక్..

షిల్లాంగ్ నగరం మొత్తాన్ని ఒకేచోట నుండి చూడాలనుకుంటే.. షిల్లాంగ్ పీక్‌కు వెళ్లాల్సిందే. ఇది ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుండి చూస్తే షిల్లాంగ్ నగరం ఒక చిన్న బొమ్మల కొలువులా కనిపిస్తుంది. హిమాలయాల మంచు శిఖరాల మెరుపులు, లోయల లోతుపాతులు ఇక్కడి నుండి స్పష్టంగా కనిపిస్తాయి. షిల్లాంగ్ నడిబొడ్డున ప్రశాంతతను కోరుకునే వారికి వార్డ్స్ లేక్ సరైన చోటు అని చెప్పొచ్చు. ఒక గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ సరస్సు చుట్టూ ఉన్న గార్డెన్స్, రంగురంగుల పూల మొక్కలు మనసుకి ఎంతో హాయినిస్తాయి. ఇక్కడ ఉండే చెక్క వంతెనపై నిలబడి సరస్సులోని చేపలకు ఆహారం వేయడం పర్యాటకులకు ఒక మంచి అనుభూతి.

ఏడు అంతస్తుల అద్భుతం

Advertisement

షిల్లాంగ్ కేవలం ప్రకృతికే కాదు, సంస్కృతికి కూడా చిరునామా. ఇక్కడి డాన్ బాస్కో మ్యూజియం ఆసియాలోనే అతిపెద్ద స్వదేశీ సంస్కృతి మ్యూజియాలలో ఒకటిగా పేరొందింది. ఈశాన్య భారత దేశంలోని ఏడు రాష్ట్రాల చరిత్ర, కళలు, సంప్రదాయాలను ఈ ఏడంతస్తుల భవనంలో కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు. ఇక షాపింగ్ ప్రియుల కోసం షిల్లాంగ్‌లో ఉన్న అడ్డా పోలీస్ బజార్. స్థానిక హస్తకళలు, వెదురుతో చేసిన వస్తువులు, ఫ్యాషన్ దుస్తులు ఇక్కడ భారీగా లభిస్తాయి. షిల్లాంగ్ లోని ఖేసి తెగ వారి రుచికరమైన వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

మేఘాల నిలయానికి చేరడం ఎలా?

మార్చి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలం షిల్లాంగ్ పర్యటనకు అత్యంత అనువైన సమయం. షిల్లాంగ్‌కు చేరుకోవాలంటే..ఇక్కడ విమానాశ్రయం ఉంది. ఇది నగరం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉమ్రోయ్ వద్ద ఉంది. కోల్‌కతా, గౌహతి వంటి నగరాల నుండి ఇక్కడికి విమానాలు నడుస్తాయి. షిల్లాంగ్‌ సమీపంలో గౌహతి విమానాశ్రయం 120 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి షిల్లాంగ్‌కు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. షిల్లాంగ్‌కు సమీపంలో గౌహతి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో షిల్లాంగ్‌కు వెళ్లొచ్చు. అస్సాం రాజధాని గౌహతి నుండి షిల్లాంగ్‌కు రోడ్డు మార్గం ఉంది. ఈ ప్రయాణం అత్యంత అందంగా, పచ్చని కొండల మధ్య సాగుతుంది.

Also Read: పాండవులు వంట చేసిన ప్రదేశం ఇక్కడే ఉందా? కోట్‌గఢ్ చారిత్రక రహస్యాలు ఇవే!

Story by: Kanugula Kishan, Big Tv

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×