E-Paper
Advertisement

జస్ట్ రూ. 16 వేలకే.. అయోధ్య, కాశీ, వైష్ణోదేవి యాత్ర!

జస్ట్ రూ. 16 వేలకే.. అయోధ్య, కాశీ, వైష్ణోదేవి యాత్ర!
Advertisement

Bharat Gaurav Tourist Trains: తెలుగు రాష్ట్రాల నుంచి పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే  వేసవిలో ప్రత్యేక భారత్ గౌరవ్  పర్యాటక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అయోధ్య, కాశీ, హరిద్వార్, మాతా వైష్ణో దేవి, రామేశ్వరం, చిదంబరం  లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను ఈ యాత్రా రైళ్లు కవర్ చేయనున్నాయి. భక్తులు IRCTC వెబ్‌ సైట్  లేదంటే హెల్ప్‌ లైన్ నంబర్ల ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

అయోధ్య- కాశీ యాత్రకు ఫుల్ డిమాండ్

ఈ ప్రత్యేక యాత్రల్లో ముఖ్యంగా అయోధ్య–కాశీ పర్యటనకు పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.  వైద్యనాథ్ ధామ్ దర్శనంతో కూడిన ఈ యాత్ర ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు జరుగుతుంది. పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాలను ఇందులో సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,700 కాగా, 3AC రూ.26,100, 2AC రూ.34,100గా నిర్ణయించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, తుని, విజయనగరం వంటి పలు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

హరిద్వార్–మాతా వైష్ణో దేవి–రిషికేశ్ యాత్ర

Advertisement

ఇంకో ముఖ్యమైన యాత్ర హరిద్వార్–మాతా వైష్ణో దేవి–రిషికేశ్ మార్గంలో ఉంటుంది. ఈ యాత్ర మే 12 నుంచి 21 వరకు జరుగుతుంది. మధుర, బృందావనం, వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి పుణ్యక్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,500 కాగా, 3AC రూ.25,700గా ఉంది. ఈ రైలు కూడా సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెలంగాణ, మహారాష్ట్రలోని పలు స్టేషన్ల మీదుగా ఉత్తర భారతానికి చేరుతుంది.

దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను కవర్ చేసే మరోయాత్ర

దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను కవర్ చేసే మరో ప్రత్యేక యాత్ర అరుణాచలం–చిదంబరం దివ్య యాత్ర. ఇది మే 24 నుంచి 31 వరకు నడుస్తుంది. తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం లాంటి ప్రదేశాలు  దర్శించుకోవచ్చు. ఈ యాత్రకు స్లీపర్ క్లాస్ టికెట్ రూ.14,500 కాగా, 3AC సుమారు రూ.21,700, 2AC రూ.27,900గా ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి మార్గాల్లో ప్రయాణిస్తుంది.

Advertisement

అటు యమునా పుష్కరాల సందర్భంలో మరో అయోధ్య–కాశీ ప్రత్యేక యాత్రను కూడా ప్రకటించింది. ఇది జూన్ 3 నుంచి 12 వరకు జరుగుతుంది. పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రదేశాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. టికెట్ ధరలు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు భక్తులకు ఒకే యాత్రలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ట్రావెల్, వసతి, భోజన సౌకర్యాలను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తారు. టికెట్ బుకింగ్‌ చేయాలనుకునే వారు IRCTC అధికారిక వెబ్‌ సైట్‌ ను చూడాలి. లేదంటే 9701360701, 9281030727, 9281030759 హెల్ప్‌ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Read Also: వందేభారత్ సూపర్ హిట్.. ఏడాదిలో ఎన్నికోట్ల మంది ప్రయాణించారంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×