E-Paper
Advertisement

Sankranti Special Trains: రిజర్వేషన్ చేసుకోలేదా?.. ఈ 12 జన్ సాధారణ్ రైళ్లు మీ కోసమే.. టైమింగ్స్ ఇవే

Sankranti Special Trains: రిజర్వేషన్ చేసుకోలేదా?.. ఈ 12 జన్ సాధారణ్ రైళ్లు మీ కోసమే.. టైమింగ్స్ ఇవే
Advertisement

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్(Unreserved) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-తిరుపతి మధ్య అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఏ తేదీల్లో

జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. విశాఖ-విజయవాడ జన్‌సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ( రైలు నెం.08567) ను నిర్ణీత తేదీల్లో నడపనున్నారు. ఈ రైలు విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ రైలు (నెం.08568) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్లలో ఆగనున్నాయి.

చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు

Advertisement

1. రైలు నెం. 07480 – చర్లపల్లి టు కాకినాడ టౌన్ -జనవరి 19న
2. రైలు నెం.07481- కాకినాడ టౌన్ టు చర్లపల్లి – జనవరి 19న

చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి స్పెషల్ ట్రైన్.. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్ లో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.

చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి స్పెషల్

Advertisement

1. రైలు నెం. 07482 – చర్లపల్లి టు తిరుపతి – జనవరి 18న
2. రైలు నెం.07483 – తిరుపతి టు చర్లపల్లి -జనవరి 18న

Also Read: హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు.. సగానికి పైగా జనరల్ బోగీలు

చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్.. జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్ లో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×