// // Sankranti Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం! -->
E-Paper
Advertisement

Sankranti Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!

Sankranti Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!
Advertisement

సంక్రాంతి పండుగ ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిగే వేడుకల కోసం తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రాకు వెళ్తుంటారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా ప్రజలు పండుగకు సొంతూళ్లకు బయల్దేరుతారు. సంక్రాంతికి సమయం దగ్గర పడుతున్నా, జంట నగరాల నుంచి వారి స్వస్థలాలకు కుటుంబాలతో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా, సంక్రాంతి రైళ్ల గురించి రైల్వే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రత్యేక రైళ్లను ప్రకటించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే నిర్లక్ష్యంగా వ్వవహరిస్తుందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్- విశాఖ మధ్య నో స్పెషల్ ట్రైన్స్

ముందస్తు టికెట్ రిజర్వేషన్ వ్యవధి ఇప్పుడు 60 రోజులకు తగ్గించబడింది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య చాలా రైళ్లకు భారీ  వెయిట్‌ లిస్ట్ కనిపిస్తోంది. ఈ రైళ్లలో బెర్త్ పొందడం సాధ్యంకావడం లేదు.  అటు SCR విశాఖపట్నంను కాదని,  సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు తక్కువ ఆదరణ లభిస్తుందని, విశాఖపట్నం జంక్షన్ నుంచి సికింద్రాబాద్ మధ్య రైళ్లు నడిపిస్తే, 100 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంటాయని చెప్తున్నారు.

Advertisement

Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-అనకాపల్లి, చర్లపల్లి-బెర్హంపూర్,  చర్లపల్లి-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ కు ప్రత్యేక రైళ్లను నడపాలనే డిమాండ్‌ ను పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) విశాఖపట్నం- సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరుకు ఉన్న ప్రత్యేక రైళ్లను మాత్రమే పొడిగించింది. కానీ, సంక్రాంతికి అదనపు రద్దీ తగ్గించేందుకు  కొత్త స్పెషల్ రైళ్లను ప్రకటించలేదు.

ప్రత్యేక రైళ్లను ముందుగా ప్రకటించాలని లేఖ

Advertisement

పండుగ సీజన్ కు ముందే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం జంక్షన్ కు ప్రత్యేక రైళ్లను, సంక్రాంతి తర్వాత తిరిగి వచ్చే రైళ్లను ప్రకటించాలని కోరుతూ.. జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (ZRUCC), తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్  రైల్వే బోర్డు ఛైర్మన్ కు లేఖ రాశారు.  జనవరి 9 నుంచి 13 వరకు సాధారణ రైళ్లలో ఖాళీలు లేవని చూపించే ఆధారాలను ఆయన సమర్పించారు. రైళ్లలో ఖాళీలు లేనందున, ప్రయాణీకులు అధిక ఛార్జీలు చెల్లించి, తరచుగా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన లేఖ కాపీలను దక్షిణ మధ్య రైల్వే (SCR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) జనరల్ మేనేజర్లు,  విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ కు కూడా పంపారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా రైళ్లను నడపడంతో పాటు ఏ రైళ్లు ఎప్పుడు నడుపుతారో ముందే ప్రకటించాలని ఈశ్వర్ కోరారు.

Read Also:  మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు, గంటల తరబడి సర్వీసులు బంద్..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×