E-Paper
Advertisement

విమానం గాల్లో ఉండగానే పగిలిన కిటికీ, ఆ విండో నుంచి పాసింజర్ సగానికి పైగా బయటకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే

విమానం గాల్లో ఉండగానే పగిలిన కిటికీ, ఆ విండో నుంచి పాసింజర్ సగానికి పైగా బయటకు,  ఆ తర్వాత  ఏం జరిగిందంటే
Advertisement

Ryanair flight: విమానం ట్రావెల్ చేసేటప్పుడు అన్నీ చెక్ చేసిన తర్వాత టేకాఫ్ అవుతుంది. ఈ చిన్న తేడా వచ్చినా ఏ ఒక్కరు బతికే ఛాన్స్ ఉండదు. అలాంటి విమానం ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా కిటికీ పగిలిపోయింది. ఆ విండో దగ్గర కూర్చొన్న వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. తోటి ప్రయాణికులు అతడ్ని పట్టుకోవడంతో సేఫ్ గా బయటపడ్డాడు.

ర్యాన్‌‌ఎయిర్‌ సంస్థ విమానానికి తప్పిన ముప్పు-శుక్రవారం ఉదయం ర్యాన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఓ విమానం గ్రీస్‌ థెస్సలోనికి నుంచి జర్మనీలోని మెమ్మింగెన్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఇంజిన్‌లో కొంత భాగం ఊడింది. అది కాస్త విమానం కిటికీని బలంగా తాకింది. దీంతో కిటికీ పగిలిపోవడంతో క్యాబిన్‌లో పీడనం తగ్గింది.

Advertisement

విమానం గాల్లో ఉండగానే పగిలిన కిటికీ-ఆక్సిజన్‌ మాస్క్‌లు ప్రయాణికులపై ఊడిపడ్డాయి. గాలి వేగానికి కిటీకి దగ్గర కూర్చున్న 60 ఏళ్ల వ్యక్తి.. సగం వరకు విమానం నుంచి బయటకు వచ్చేశాడు. కిటికీ బయటకు ప్రయాణికుడి తల-భుజం కనిపించడంతో విమానంలో తీవ్ర కలకలం రేగింది. పాసింజర్ సీటు బెల్ట్ పెట్టుకోవడం, సమయానికి మిగతా ప్రయాణికులు అలర్ట్ కావడంతో ఆ వ్యక్తిని లోపలికి లాగారు.

ఓ ట్రావెలర్ కిటికీ నుంచి బయటకు-దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని ట్రావెల్ చేసిన ఓ ప్యాసింజర్ జరిగిన ఘటన గురించి వివరించాడు. పరిస్థితి గమనించిన పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పాడు. వెంటనే థెస్సలోనికి ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేసిన పైలట్-ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ప్రాణాపాయం లేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ర్యాన్‌ఎయిర్‌ సంస్థ వర్గాలు తెలిపాయి. ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఘటన సమయంలో విమానం సుమారు 10 నిమిషాల పాటు గాలిలో ఉంది.

ALSO READ: ఇన్నాళ్లు తార్నకలో తిరిగాం.. కానీ, ఈ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందని తెలియదే!

ఆ తర్వాత అకస్మాత్తుగా 9,000 అడుగులు కిందకు దిగి వచ్చింది. ఈ సమయంలో పేలుడు శబ్దం వచ్చినట్టు ప్రయాణికులు స్థానిక మీడియాకు తెలిపారు. కిటీకి దగ్గర గాయపడిన బాధితులు సెర్బియా జాతీయుడు. గాలికి ప్రయాణికుడ్ని ఆపడానికి ముందు అతడి భార్య సుమారు ఐదు నిమిషాల పాటు కాళ్లను పట్టుకున్నట్లు తెలిపారు.

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×