E-Paper
Advertisement

Plane Missing: 50 మందితో వెళ్తున్న విమానం గాల్లోనే అదృశ్యం.. ఇంతకీ ఏమైనట్టు?

Plane Missing: 50 మందితో వెళ్తున్న విమానం గాల్లోనే అదృశ్యం.. ఇంతకీ ఏమైనట్టు?
Advertisement

Russian Plane Missing: గత కొద్ది రోజులుగా విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట విమానాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం, మంటలు చెలరేగడం జరుగుతూనే ఉన్నాయి. విమానం ఎక్కాలంటేనే భయంగా ఉందంటూ పలువురు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.

50 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం

Advertisement

తాజాగా రష్యాలో షాకింగ్ ఘటన జరింది. ప్రయాణీకులతో వెళ్తున్న విమానం మార్గం మధ్యలోనే మిస్ అయ్యింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అన్న సమయంలో ఏటీసీ నుంచి సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు.

సైబీరియాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్‌ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది. 50 మందితో బయలుదేరిన విమానం.. ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. చైనా బోర్డ‌ర్ స‌మీపంలో అముర్ ప్రాంతంలోని టిండా ప‌ట్ట‌ణం దిశ‌గా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సడన్‌గా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. “అంగారా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఏఎన్-24 విమానం టిండా మీదుగా వెళ్తుండగా మిస్ అయ్యింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బందితో సహా 43 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది” అని అధికారులు తెలిపారు.

Advertisement

అలర్ట్ అయిన అధికారులు, గాలింపు చర్యలు ముమ్మరం

విమానం అదృశ్యం అయిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు. విమానం కోసం వెతకడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెర్చ్ ఆపరేషన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. విమానం ఎక్కడ ఉంది, ఇలా జరగడానికి వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే విమానానికి సంబంధించిన వివరాలను కనిపెట్టే అవకాశం ఉన్నట్లు రష్యా విమానయానశాఖ అధికారులు వెళ్లడించారు. విమానంలోని వారంతా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Read Also: రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీ, ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×