E-Paper
Advertisement

Viral Video: రైలులో రీల్స్.. విసిగిపోయిన తోటి ప్రయాణికులు ఏం చేశారంటే?

Viral Video: రైలులో రీల్స్.. విసిగిపోయిన తోటి ప్రయాణికులు ఏం చేశారంటే?
Advertisement

రైల్వే అధికారులు ప్రయాణీకులు రైల్వే ప్రదేశాల్లో ఎలా ఉండాలో ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదాల నుంచి కాపాడుకోవడంతో పాటు రైళ్లలో ఆహ్లాదకరమైన ప్రయాణాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయినా కొంత మంది ప్రయాణీలకుతు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా లక్నోగరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణిస్తున్నఓ ఫ్యామిలీ రైలు కోచ్ ను ఏకంగా రీల్ స్టూడియోగా మార్చేసింది. పక్కనే ఉన్న ప్రయాణీకులకు చిరాకేసి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ వైరల్ వీడియోలో ఏం ఉందంటే?

ఈ వీడియోలో ఓ ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ వ్యక్తి ల్యాప్ టాప్ లో గట్టిగా సౌండ్ పెట్టి పాట ప్లే చేయగా, మిగతా కుటుంబ సభ్యులు రైల్వే బెడ్ క్లాత్స్ ను మీద కప్పుకుని డ్యాన్స్ చేస్తున్నారు. కోచ్ అంతటిని గందరగోళంగా మార్చారు. అరుపులు, ఈలలు, కేకలతో ఇతర ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. కోచ్ లోని వారందరికీ వీరి న్యూసెన్స్ పెద్ద తలనొప్పిగా మారింది.

రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసిన తోటి ప్రయాణీకులు

Advertisement

ఎంతకీ వాళ్ల గోల ఆగకపోవడంతో అదే కోచ్ లో ప్రయాణిస్తున్న వర్మ అనే వ్యక్తి, రైల్వే హెల్ప్‌ లైన్‌ కు కాల చేశాడు. ఆయన ఫిర్యాదును అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. కోచ్ లోకి వచ్చి రీల్స్ చేస్తున్న వ్యక్తులను మందలించారు. మళ్లీ రిపీట్ అయితే, సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. కొంత మంది ప్రయాణీకులకు కామన్ సెన్స్ లేకుండా పోతుందని, అలాంటి వారి వల్ల తోటి ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వర్మ రాసుకొచ్చాడు. రైలు అనేది పబ్లిక్ ప్రదేశం అని, న్యూసెన్స్ చేయడం మంచిది కాదని సూచించాడు. ప్రయాణ సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నారు. తోటి ప్రయాణీకులు రకరకాల ఆలోచనలతో ఉంటారని ఇలాంటి వారి న్యూసెన్స్ కారణంగా సీరియస్ గా స్పందించే అవకాశం ఉందన్నారు.

https://www.instagram.com/reels/DVlE7rOkyp6/

Advertisement

Read Also: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. రైళ్లలో ఇలాంటి ప్రవర్తన అస్సలు మంచిది కాదంటున్నారు. పలువురు తమ రైలు ప్రయాణాల సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వివరించారు. ఇలాంటి వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే, ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా మారుతారని సూచించారు. అయితే, ఈ ఘటనపై రైల్వే అధికారుల మందలించి వదిలేశారు. ఎలాంటి జరిమానా విధించలేదు. ఆ తర్వాత వాళ్లు కామ్ గా ఉండటంతో పరిస్థితి సర్దుమణిగింది.

Read Also: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×