E-Paper
Advertisement

Trains Cancelled: పొగ మంచు ఎఫెక్ట్, 24 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే!

Trains Cancelled: పొగ మంచు ఎఫెక్ట్, 24 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే!
Advertisement

Indian Railway: దేశ వ్యాప్తంగా శీతాకాలం తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. రైళ్ల రాకపోకల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. పలు కీలక మార్గాల్లో విజుబులిటీ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 ఈ రద్దు అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతున్నాయి. శీతాకాలంలో పొగమంచును ఎదుర్కోవడానికి రైల్వేలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా, తూర్పు మధ్య రైల్వే డిసెంబర్ 1 నుంచి మార్చి 3 వరకు మొత్తం 24 రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పొగమంచు కారణంగా రద్దు చేయబడే రైళ్ల జాబితాను రైల్వే జోన్ విడుదల చేసింది.

రైల్వే రద్దు చేసిన రైళ్లు ఇవే!

Advertisement

⦿ రైలు నంబర్ 14112, ప్రయాగ్‌రాజ్ జంక్షన్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 25, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 14111, ముజఫర్‌పూర్-ప్రయాగ్‌రాజ్ జంక్షన్ ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 25, 2026 వరకు రద్దు.

Advertisement

⦿ రైలు నంబర్ 22198, విరంగన లక్ష్మీబాయి-కోల్‌కతా ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 5, 2025 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 22197, కోల్‌కతా- విరంగన లక్ష్మీబాయి ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 7, 2025 నుంచి మార్చి 1, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 12327, హౌరా- డెహ్రాడూన్ ఉపాసన ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 2, 2025 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 12328, డెహ్రాడూన్- హౌరా ఉపాసన ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 3, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 14003, మాల్డా టౌన్- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 6, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్  14004, న్యూఢిల్లీ-మాల్డా టౌన్ ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 4, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్  14523, బరౌనీ- అంబాలా హరిహర్ ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 4, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 14524, అంబాలా- బరౌనీ హరిహర్ ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 2, 2025 నుంచి ఫిబ్రవరి 24, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్  14617, పుర్నియా కోర్ట్- అమృత్‌ సర్ జనసేవా ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 3, 2025నుంచి  మార్చి 2, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 14618, అమృత్‌ సర్- పూర్ణియా కోర్ట్ జనసేవా ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు రద్దు.

⦿ రైలు నెంబర్ 15903, 15904 దిబ్రుగర్- చండీగఢ్,  చండీగఢ్- దిబ్రుగర్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు డిసెంబర్ 1, 2025 నుండి మార్చి 1, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 15620, 15619, కామాఖ్య- గయా ఎక్స్‌ప్రెస్, గయా- కామాఖ్య ఎక్స్‌ ప్రెస్ రైళ్లు డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 24, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 15622, ఆనంద్ విహార్- కామాఖ్య ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 5, 2025 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు.

⦿రైలు నంబర్ 12873, హతియా- ఆనంద్ విహార్ ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 12874, ఆనంద్ విహార్- హతియా ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 2, 2025 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 22857, సంత్రాగచి- ఆనంద్ విహార్ ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1, 2025 నుంచి మార్చి 2, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 22858, ఆనంద్ విహార్- సంత్రాగచి ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 2, 2025 నుంచి మార్చి 3, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 18103, టాటా- అమృత్‌ సర్ ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 25, 2026 వరకు రద్దు.

⦿ రైలు నంబర్ 18104, అమృత్‌సర్- టాటా ఎక్స్‌ ప్రెస్, డిసెంబర్ 3, 2025 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు రద్దు.

డిసెంబర్ 1- మార్చి 3 మధ్య ఈ మార్గాల్లో రైలు ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×