E-Paper
Advertisement

ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!

ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

4 Kakinada Trains Regularized: సమ్మర్ లో కాకినాడ ప్రజలకు రైల్వే కూల్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రత్యేక  రైళ్లుగా నడుస్తున్న నాలుగు సర్వీసులను ఇకపై రోజువారీ రైళ్లుగా మార్చాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ  నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మార్చి 25న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ నాలుగు రైళ్లు ఇకపై తాత్కాలికంగా కాకుండా రెగ్యులర్ సర్వీసులుగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో కాకినాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రతిరోజూ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మైసూరు, లింగంపల్లి, హిసార్, రాజమండ్రి లాంటి ప్రాంతాలకు ఈ రైళ్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.

నాలుగు రైళ్లకు కొత్తపేర్లు

ఇప్పటి వరకు ఈ రైళ్లు కాకినాడకు ప్రత్యేక సర్వీసులుగా నడిచేవి. అంటే, కొన్ని తేదీల్లో మాత్రమే సర్వీసులు అందించేవి. ప్రయాణికులు ముందుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు ఈ రైళ్లు రోజువారీ సర్వీసులుగా మారడంతో ప్రయాణం మరింత సులభం కానుంది.  ఈ నాలుగు రైళ్లకు కొత్త పేర్లను కూడా రైల్వే నిర్ణయించింది. లింగంపల్లి ఎక్స్‌ ప్రెస్, హిసార్ ఎక్స్‌ ప్రెస్, మైసూరు ఎక్స్‌ ప్రెస్,  కాకినాడ పోర్ట్–రాజమండ్రి MEMU ఎక్స్‌ ప్రెస్ గా పేరు పెట్టారు. ఈ పేర్లు ఆయా రైళ్ల మార్గాలను ఈజీగా ప్రయాణీకులకు తెలిసేలా చేస్తున్నాయి.

ఏప్రిల్ నుంచి అందుబాటులోకి..

Advertisement

ఈ కొత్త రెగ్యులర్ సర్వీసులు ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ప్రారంభమైన తర్వాత, ప్రయాణికులు ఇకపై ప్రత్యేక రైళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పక్కా టైమ్‌ టేబుల్ ఉండటంతో టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మరింత ఈజీ కానుంది.  ఈ నిర్ణయం ముఖ్యంగా ఉద్యోగాలు, చదువు, వ్యాపారం, ఇతర పనుల కోసం తరచూ ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో రద్దీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

కాకినాడ రైల్వే సౌకర్యాలు మరింత మెరుగు 

తాజా రెగ్యులర్ రైళ్లతో కాకినాడ నగరానికి రైల్వే సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. దేశంలోని పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది లాభదాయకంగా మారనుంది.  ఈ మార్పు కాకినాడ ప్రాంత ప్రజలకు ఓ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులను ఉపయోగించుకునే ప్రయాణీకులకు లభించనుంది. రైల్వే నిర్ణయం పట్ల కాకినాడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also: ఆరు జతల రైళ్లకు అదనపు కోచ్‌లు.. సమ్మర్ స్పెషల్స్ కూడా, రైల్వే గుడ్ న్యూస్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×