E-Paper
Advertisement

Vande Bharat Express: ఆ రూట్లో కొత్త వందే భారత్.. ఏకంగా 5 గంటల సమయం ఆదా!

Vande Bharat Express: ఆ రూట్లో కొత్త వందే భారత్.. ఏకంగా 5 గంటల సమయం ఆదా!
Advertisement

దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 160 వందేభారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా సర్వీసులు అందిస్తుండగా, మరో రైలు యాడ్ కాబోతోంది. వందేభారత్ రైల్వే నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసేలా పూణే- నాందేడ్ మధ్య కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 12 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, ఇప్పుడు 13వ రైలు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. ఈ వందేభారత్ పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడాలో ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే మహారాష్ట్రలో 12 వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ముంబై, పూణే, నాగ్‌ పూర్ లాంటి ప్రధాన నగరాలను సమీప రాష్ట్రాలలోని ఇతర ముఖ్య నగరాలు కలుపుతోంది. పూణే-నాందేడ్ మార్గం మరొక కీలకమైన లింక్‌ ను యాడ్ చేస్తోంది. మహారాష్ట్రలోని  పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచనుంది.

పూణే- నాందేడ్ రూట్, కీ స్టాప్‌లు

పుణే- నాందేడ్ మధ్య 550 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం కేవలం 6 నుంచి  గంటల్లో పూర్తవుతుంది. ప్రస్తుత రైళ్ల ద్వారా ప్రయాణ సమయం 10 నుంచి 12 గంటలు పడుతుంది. ప్రస్తుతం సమయంతో పోల్చితే సగానికి పైగా జర్నీ టైమ్ ఆదా కానుంది. ఈ సెమీ హై స్పీడ్ సర్వీస్ రైలు పరిమిత స్టాప్‌లను కలిగి ఉంటుంది.

పూణే- నాందేడ్ వందే భారత్ ఆగే స్టేషన్లు

Advertisement

⦿ పుణే

⦿ కుర్దువాడి

Advertisement

⦿ ధర శివ్

⦿ నాందేడ్

కొత్త వందేభారత్ రైలు కేవలం 4 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గం బర్షి, మాధ, పంధర్‌ పూర్, కర్మల నివాసితులకు కూడా ప్రయోజనం కలిగించనుంది. వారికి వేగవంతమైన, మరింత సౌకర్యవంతంమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.   సోలాపూర్ జిల్లాలోని ప్రయాణీకులకు, కొత్త సర్వీసు ప్రస్తుత సోలాపూర్-ముంబై వందే భారత్‌ తో పోలిస్తే మెరుగైన ప్రయాణ టైమింగ్స్ ను అందిస్తుంది. ఆ రైలు తెల్లవారుజామున, రాత్రి సమయంలో నడుస్తుంది. పూణే-నాందేడ్ ఎక్స్‌ ప్రెస్‌   మధ్యాహ్నం బయలుదేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది పగటి ప్రయాణాలు, ఇంటర్‌ సిటీ వ్యాపార ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.

Read Also: రన్నింగ్ ట్రైన్ లో ఫుడ్ డెలివరీ, ఆశ్చర్యపోయిన ఆస్ట్రేలియన్ యువతి!

టికెట్ ధర ఎంత ఉంటుందంటే?

పూణే-నాందేడ్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ డిసెంబర్ 2025 చివరిలో లేదంటే జనవరి 2026 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. తరగతి, రూట్ దూరాన్ని బట్టి టిక్కెట్ ధరలు రూ.1,200 నుంచి రూ.2,500 వరకు ఉంటాయి. ఈ రైలు ఇప్పటికే ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసుకుంది. పుణే–నాందేడ్ వందే భారత్ వాణిజ్యం, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పశ్చిమ మహారాష్ట్ర,  మరాఠ్వాడ మధ్య దూరాన్ని ఈ వందేభారత్ మరింత తగ్గించనుంది.

Read Also: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×