E-Paper
Advertisement

పోచంపల్లి ఇక్కత్‌కు ప్రధాని ప్రశంసలు.. అసలు ఈ చేనేతలో ఉన్న మ్యాజిక్ ఏంటి?

పోచంపల్లి ఇక్కత్‌కు ప్రధాని ప్రశంసలు.. అసలు ఈ చేనేతలో ఉన్న మ్యాజిక్ ఏంటి?
Advertisement

PM Modi On Pochampally Ikat Sarees: తెలంగాణ చేనేత రంగం పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మార్మోగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆగస్టు 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పోచంపల్లి ఇక్కత్ చేనేతపై ప్రశంసల జల్లు కురిపించారు. తరతరాలుగా ఈ కళను కాపాడుతూ వస్తున్న నేతన్నలను అభినందించారు. ఈ నేపథ్యంలో  అసలు ఇక్కత్ చేనేత అంటే ఏంటి? పోచంపల్లి ఇక్కత్ ఎందుకు అంత ప్రత్యేకత? అనే విషయంపై మళ్లీ ఆసక్తి పెరిగింది.

ఇక్కత్ చేనేత అంటే ఏంటి?

ఇక్కత్ అనేది ఒక ప్రత్యేకమైన చేనేత కళ. సాధారణంగా చీర లేదంటే వస్త్రాన్ని నేసిన తర్వాత రంగులు వేస్తారు. కానీ ఇక్కత్‌లో మాత్రం ముందుగా దారాలకే రంగులు అద్దుతారు. నేయాల్సిన డిజైన్‌ ను ముందే నిర్ణయించి, దారాలను ప్రత్యేకంగా కట్టి వాటికి రంగులు వేస్తారు. ఆ తర్వాత ఆ రంగుల దారాలతో చీరను నేస్తారు. ఈ పద్ధతినే  టై అండ్ డై (Tie and Dye) టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఈ విధానంలో చిన్న పొరపాటు జరిగినా మొత్తం డిజైన్ మారిపోతుంది. అందుకే ఇక్కత్ చేనేతకు ఎంతో నైపుణ్యం, ఓర్పు, అనుభవం అవసరం. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన చేనేత కళల్లో ఒకటిగా భావిస్తారు.

Advertisement

పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేకత ఏమిటి?

పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన రేఖాగణిత డిజైన్లకు ప్రసిద్ధి చెందింది. చతురస్రాలు, వజ్రాకారాలు, గీతలు, సంప్రదాయ ఆకృతులతో కనిపించే డిజైన్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరో విశేషం ఏమిటంటే.. చీర ముందు భాగంలో కనిపించే డిజైన్ వెనుక భాగంలో కూడా దాదాపు అదే విధంగా కనిపిస్తుంది. ఇది సాధారణ చీరల్లో కనిపించని ప్రత్యేకత. ఈ నైపుణ్యమే పోచంపల్లి నేత కళాకారుల ప్రతిభకు నిదర్శనం.

తయారీ ఎలా ఉంటుంది?

Advertisement

ఒక పోచంపల్లి ఇక్కత్ చీర తయారు చేయడానికి ముందుగా దారాలను డిజైన్ ప్రకారం చిన్న చిన్న భాగాలుగా కట్టి రంగులు వేస్తారు. రంగులు ఎండిన తర్వాత వాటిని చేతిమగ్గంపై ఎంతో జాగ్రత్తగా అమర్చి నేస్తారు. ప్రతి దారం సరైన స్థానంలో ఉండేలా చూసుకుంటూ నేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా చేతిపనితో జరుగుతుంది. ప్యూర్ ఇక్కత్ పట్టు చీరను తయారు చేయడానికి సాధారణంగా ఇద్దరు నేత కార్మికులకు 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుంది. డిజైన్ క్లిష్టతను బట్టి మరింత సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది.

ఏ దారాలతో తయారు చేస్తారు?

పోచంపల్లి ఇక్కత్‌ను ప్రధానంగా స్వచ్ఛమైన పట్టు, నాణ్యమైన పత్తి దారాలతో తయారు చేస్తారు. అందుకే ఈ చీరలు అందంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ముందుగానే దారాలకు రంగులు వేయడం వల్ల రంగు త్వరగా వెలిసిపోదు.

పోచంపల్లి ఇక్కత్‌కు జీఐ ట్యాగ్  

పోచంపల్లి ఇక్కత్‌కు ఉన్న ప్రత్యేకతను గుర్తించి భారత ప్రభుత్వం 2004లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపును మంజూరు చేసింది. ఈ గుర్తింపుతో పోచంపల్లిలో తయారయ్యే అసలైన ఇక్కత్ చేనేతకు ప్రత్యేక గుర్తింపు లభించింది. నకిలీ ఉత్పత్తుల నుంచి ఈ సంప్రదాయ కళకు రక్షణ కూడా కలిగింది. ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్ మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఎన్నో దేశాలకు ఈ చీరలు ఎగుమతి అవుతున్నాయి. ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది యూనిఫామ్‌గా కూడా పోచంపల్లి పట్టు చీరలను ఎంపిక చేయడం ఈ చేనేతకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.

ఎందుకు అంత విలువ?

పోచంపల్లి ఇక్కత్ అనేది కేవలం ఒక చీర మాత్రమే కాదు. ఇది తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యానికి, శ్రమకు, సంప్రదాయానికి ప్రతీక. ప్రతి చీర వెనుక ఎన్నో రోజుల కష్టం, కచ్చితమైన లెక్కలు, రంగులపై అవగాహన, అద్భుతమైన నేత నైపుణ్యం దాగి ఉంటుంది. అందుకే పోచంపల్లి ఇక్కత్‌కు దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా మన్ కీ బాత్లో ఈ చేనేతను ప్రస్తావించడంతో మరోసారి పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Read Alos: నల్లగొండ జిల్లాలో వజ్రాలు, బంగారు గనులు, వామ్మో.. అన్ని చోట్ల ఉన్నాయా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×