E-Paper
Advertisement

Vande Bharat sleeper: పట్టాలెక్కిన ఫస్ట్ వందేభారత్ స్లీపర్, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!

Vande Bharat sleeper: పట్టాలెక్కిన ఫస్ట్ వందేభారత్ స్లీపర్, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!
Advertisement

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చివేసిన రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. ఈ సెమీ హైస్పీడ్ రైలు అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత వేగంతో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. సుమారు 135 కిలో మీటర్ల వేగంగా ప్రయాణించే ఈ రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 150 వందభారత్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. ఇక సుదూర రాత్రి ప్రయాణాల కోసం తయారు చేసిన, వందేభారత్ స్లీప్ రైలు కోసం దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్నారు. తాజాగా తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఈ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు హౌరా- గౌహతి నడుమ సర్వీసులు అందించనుంది.

మెరుగైన భద్రత, అత్యాధునిక సౌకర్యాలు

ఈ వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన, సాంకేతికంగా అధునాతన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైల్లో ఎర్గోనామిక్ బెర్త్‌లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, ఆధునిక ఆన్‌ బోర్డ్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇవి సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా కొనసాగించేలా రూపొందించబడ్డాయి.  భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా రాత్రిపూట మార్గాలకు అప్‌ గ్రేడ్‌గా భావిస్తున్నారు.

విద్యార్థులు, రైల్వే సిబ్బందితో ప్రధాని మాటముచ్చట   

Advertisement

ఈ రైలును ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లోకో పైలట్లు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న రైల్వే సిబ్బంది కృషిని ప్రధానమంత్రి అభినందించారు. అటు మాల్దాకు  వచ్చే గౌహతి-హౌరా వందే భారత్ స్లీపర్ రైలును కూడా ఆయన వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. హౌరా-గౌహతి మార్గంలో ప్రయాణ సమయాన్నిఈ రైలు సుమారు 2.5 గంటలు తగ్గిస్తుందన్నారు. ఈ రైలు కామాఖ్య దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు పర్యాటక రంగానికి పెద్ద ఊపునిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.

మరింత సౌకర్యవంతమైన ప్రయాణం

వందేభారత్ స్లీపర్ రైలు దేశంలో సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుకోబోతున్నట్లు చెప్పారు. ఇకపై సుదూర ప్రయాణాలను కూడా అత్యంత సౌకర్యవంతంగా కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు.

బెంగాల్ అభివృద్ధి, కనెక్టివిటీకి మరింత జోష్

Advertisement

ఇక ఈ వందేభారత్ స్లీపర్ రైలు బెంగాల్ అభివృద్ధికి మరింత సాయపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. మాల్దా అభివృద్ధికి సెంటర్ గా మారబోతుందన్నారు. ఇవాళ తాను పునాది రాయి వేసిన పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులు బెంగాల్ వృద్ధికి కీలక మలుపు కాబోతున్నాయన్నారు. వందేభారత్ స్లీపర్ తో ప్రయాణ వేగాన్ని పెంచడంతో పాటు వాణిజ్యం, వ్యాపారాన్ని మరింత పెంచనుందన్నారు. కొత్త రైలు సేవల కారణంగా స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వందేభారత్ స్లీపర్ రైలు సహకరిస్తుందన్నారు ప్రధాని మోడీ.

Read Also: వందే భారత్ వెర్షన్ 4.0 వచ్చేస్తోంది.. దీని స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×