E-Paper
Advertisement

బహామాస్‌‌లో ఘోర ప్రమాదం.. సముద్రంలో కూలిన విమానం.. 10 మంది మృతి, ఎలా జరిగింది?

బహామాస్‌‌లో ఘోర ప్రమాదం.. సముద్రంలో కూలిన విమానం.. 10 మంది మృతి, ఎలా జరిగింది?
Advertisement

Flight Crash: బహామాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సముద్రంలో జరగడంతో అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఆదేశ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసలు ఘటన ఎలా జరిగింది?

బహామాస్‌ ఘోర విమానం ప్రమాదం-శుక్రవారం బహమాస్‌లో ఓ విమానం కూలిన ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్లెమింగో ఎయిర్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. ద్వీప సమూహం అయిన బహమాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ ఎయిర్‌పోర్టు నుంచి శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది ఫ్లెమింగో విమానం.

Advertisement

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సముద్రంలో కూలింది-టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నసావుకు పశ్చిమాన నార్త్ ఆండ్రోస్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ ప్రకటించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు.

53వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ విషాదం-స్వాతంత్య్రం దినోత్సవం వేళ ఈ ఘటన ఆదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. బహామాస్ ప్రజలు 53వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఈ ఘటన జరిగింది. తాము ప్రేమించేవారు ఇంటికి తిరిగి రారనే విషాదకరమైన వార్తను అందుకున్న ప్రతి కుటుంబానికి ఆ దేశ ప్రధాని సానుభూతి తెలిపారు.

Advertisement

విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టినట్టు బహమాస్‌ విమాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బహామాస్‌లో రిజిస్టర్ అయిన సెస్నా 402 రకానికి చెందిన విమానం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్లెమింగో ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

ALSO READ: విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ, విండో నుంచి బయటకు పాసింజర్

కేవలం భద్రతా చర్య మాత్రమేనని ఆదేశ విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం జరిగిన రెండు భద్రతా సంఘటనల ఫలితంగా నిలిపివేత జరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు ముందు మరొక విమాన ప్రమాదం జరిగింది. మాయాగువానా ద్వీపానికి బయలుదేరిన ఓ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది.

దీన్ని గమనించిన పైలట్, విమానాన్ని అత్యవసరంగా నసావు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు దిగిపోయిన కొద్దిసేటికి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×