E-Paper
Advertisement

Shocking Video: ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!

Shocking Video: ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!
Advertisement

Shocking Pantry Car Video Goes Viral: రైల్వే ఫుడ్ మీద తరచుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ మీద, శుభ్రత మీద ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. సాధారణ రైళ్ల మాట అటు ఉంచితే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రీసెంట్ గా భోజనంతో పాటు పెరుగులోనూ పురుగులు వచ్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన రైల్వే, క్యాటరర్ కు రూ. 10 లక్షల జరిమానా విధించడంతో పాటు కాంట్రాక్ట్ ను రద్దు చేశారు.

వెలుగులోకి షాకింగ్ వీడియో

ఇక తాజాగా రైల్వే ఫుడ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్నాకులం నుంచి పూణేకు వెళ్లే ఎక్స్‌ ప్రెస్ రైలులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ రైలులోని ప్యాంట్రీ కార్‌ కు సంబంధించిన  నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది. రైల్వే ఆహార భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్యాంట్రీ కార్ లోపల ఎలుకల గుంపు

Advertisement

ఈ వీడియోను ఒక ప్రయాణికుడు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్యాంట్రీ కార్ లోపల ఎలుకల గుంపు తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఫుడ్ తయారు చేసే ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు. ప్రతిరోజూ వందలాది ప్రయాణికులకు అందించే భోజనం ఇలాంటి వాతావరణంలో తయారవుతుందా? అని నెటిజన్లు  సీరియస్ అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఇది చిన్న విషయం కాదంటున్నారు. ఎలుకలు అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయని, వాటివల్ల ఫుడ్ ఈజీగా పాయిజన్ అవుతుందంటున్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు రావచ్చంటున్నారు.

రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై విమర్శలు

Advertisement

ఈ సంఘటనతో రైల్వే క్యాటరింగ్ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరైన విధంగా పాటిస్తున్నారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాంట్రీ కార్లలో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయా? శానిటైజేషన్ సరిగా జరుగుతోందా? అని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది రైలులో ఆహారం ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తుందంటున్నారు. ఈ ఘటన ఒక హెచ్చరికగా భావించి..  రైల్వే అధికారులు వెంటనే స్పందించాలంటున్నారు.  ఇలాంటి సమస్యలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్ననారు. ప్యాంట్రీ కార్లలో కఠినమైన నియంత్రణలు అమలు చేయాలంటున్నారు. క్రమం తప్పకుండా తనిఖీల చేయాలంటున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×