E-Paper
Advertisement

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు
Advertisement

Chennai Airport: చెన్నై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం తోటి ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రయాణికుడు దూకాడు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

చెన్నై ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున ఊహించని ఘటన

Advertisement

ఆదివారం తెల్లవారుజామున షార్జా-చెన్నైకి ఎయిర్ అరేబియా వచ్చింది. విమానం ల్యాండైన తర్వాత రన్‌వేపై కదులుతుండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచి విమానం నుండి దూకేశాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఘటన సమయంలో విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ప్రధాన రన్‌వేను దాటి టాక్సీవేపై నెమ్మదిగా కదులుతోంది. ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకు ఈ సంఘటన జరిగింది. ఊహించని పరిణామంతో క్యాబిన్‌లో సిబ్బంది, తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

విమానం రన్ వేపై కదులుతుండగా ఎమర్జెన్సీ గేటు నుంచి దూకిన ప్రయాణికుడు

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, విమానానికి నష్టం జరగలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఘటన ప్రధాన రన్‌వేపై జరగలేదని ఎయిర్‌పోర్టుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానంలో అస్వస్థతకు గురై ఉండవచ్చని, రెండుసార్లు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అతడు ప్రభావితం కావచ్చని అంటున్నారు.

పైలట్ వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది.

ALSO READ: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

ముందుజాగ్రత్త చర్యగా ప్రధాన రన్‌వేను ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు మూసివేశారు. అంతర్జాతీయ విమానాలను మరొక రన్‌వే వైకి మళ్లించారు. ఆ ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. భద్రతా ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×