E-Paper
Advertisement

ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!

ట్రైన్‌ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Indian Railway Viaral Video: ఎండలు రోజు రోజుకూ పెరుగుతున్న వేళ ప్రజలు చల్లదనం కోసం కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగానే బీహార్‌ లో ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ట్రైన్‌ లో వెళ్లే ప్రయాణికులు బ్యాగులు, సూట్‌ కేసులు, చిన్న ఫ్యాన్లు తీసుకెళ్తుంటారు. కానీ, ఓ ప్రయాణికుడు ఏకంగా  చిన్న ఎయిర్ కూలర్‌ ను ట్రైన్ లో పెట్టుకుని ప్రయాణిండం అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సదరు ప్రయాణికుడు ట్రైన్‌ లోని తన సీటు దగ్గర కూలర్‌ ను పెట్టుకుని హాయిగా పడుకున్నాడు. కూలర్‌ లో నీళ్లు పోసి, పవర్ కనెక్షన్ ఇచ్చి ప్రయాణించాడు.  ట్రైన్‌ లోని ఇతర ప్రయాణికులు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. రైల్లోని కొందరు ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఐడియా అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అటు ఎండల నుంచి తప్పించుకోవడానికి క్రేజీ ఆలోచన అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరు ఆయన చేసిన పనిని తప్పుబడుతున్నారు. ట్రైన్‌ లో ఇలా కూలర్ వాడటం ప్రమాదకరం కావచ్చంటున్నారు. రైల్వే నిబంధనలకు విరుద్ధం ఇలా చేయడం మంచిది కాదని మరో వ్యక్తి కామెంట్ చేశారు.   ఎలక్ట్రిక్ పరికరాలను ట్రైన్‌ లో అనుమతి లేకుండా ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

రైళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులను తీసుకెళ్లొచ్చా?    

రైల్వేల్లో సాధారణంగా భారీ ఎలక్ట్రిక్ పరికరాలను తీసుకెళ్లడంపై కొన్ని రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్  వినియోగించే వస్తువులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, ఈ ప్రయాణికుడు ఏకంగా  కూలర్‌ను ఎలా తీసుకెళ్లాడు? అధికారుల అనుమతి ఉందా? అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఘటనపై రైల్వే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లలో వైరల్ అవుతోంది.  లక్షలాది మంది ఈ వీడియోను చూసి క్రేజీగా రియాక్ట్ అయ్యారు. మొత్తంగా ఎండలు మండుతున్న వేళ  ప్రయాణికుడు చేసిన ఈ పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

Advertisement

Read Also: ట్రైన్ టాయిలెట్‌ లో పడిపోయిన గోల్డ్ రింగ్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×