E-Paper
Advertisement

Indian Railways: ఆ సబ్సిడీల జోలికి వెళ్లకండి, పార్లమెంటరీ ప్యానెల్ కీలక సిఫార్సులు!

Indian Railways: ఆ సబ్సిడీల జోలికి వెళ్లకండి, పార్లమెంటరీ ప్యానెల్ కీలక సిఫార్సులు!
Advertisement

భారతీయ రైల్వే అందిస్తున్న సబ్సిడీలను అలాగే కొనసాగించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సబర్బన్, నాన్ ఏసీ టికెట్లపై సబ్సిడీలు ఇవ్వడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ప్రయాణభారం తగ్గుతుందని అభిప్రాయపడింది. రైల్వేశాఖ గ్రాంట్ల డిమాండ్లపై రైల్వే స్టాండింగ్ కమిటీ  కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది.  ఏసీ క్లాస్ ఛార్జీలను ఖర్చులతో కంపేర్ చేయడానికి, నాన్-ఏసీ క్లాస్ లను క్రమంగా, సరసమైన సర్ధుబాట్లను చేయడానికి ఎప్పటికప్పుడు సమగ్ర ఛార్జీల సమీక్ష చేపట్టాలని సూచించింది.

ఆదాయం లేకున్నా సబ్సిడీలు

Advertisement

పార్లమెంట్ సభ్యుడు సి.ఎం. రమేష్ నేతృత్వంలోని ప్యానెల్ ఈ మేరకు సమావేశమైన కీలక నిర్ణయాలు తీసుకున్నది. “2020, 2022లో ఛార్జీల హేతుబద్ధీకరణ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఇందులో నాన్ ఏసీ,  ఏసీ క్లాస్ ఛార్జీలలో స్వల్ప పెరుగుదల ఉంది. ఏసీ ఇఎంయు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఫస్ట్ క్లాస్ సబర్బన్ ఛార్జీలలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. అయినప్పటికీ భారతీయ రైల్వే ప్రయాణీకుల టికెట్లపై భారీగా సబ్సిడీని అందిస్తూనే ఉన్నాయి” అని ప్యానల్ వెల్లడించింది.

ఆదాయ పెంపు కోసం చర్యలు చేపట్టిండి!

Advertisement

ఇక  సబర్బన్ సేవలు ఖర్చులలో 30 శాతం మాత్రమే వసూలు చేస్తున్నాయని తెలిపింది. నాన్ ఎసీ ప్రయాణంలో 39 శాతం మాత్రమే వసూలు చేస్తుందని వివరించింది. ఏసీ ప్రయాణం కేవలం 3.5 శాతం స్వల్ప మిగులును సాధిస్తుందని  ప్యానెల్ గుర్తించింది. తక్కువ ఆదాయం ఉన్నా ప్రయాణీకులకు సరసమైన ధరలను నిర్ధారించేటప్పుడు, నికర ఆదాయాన్ని పెంచడానికి రైల్వేలు సమగ్రమైన వ్యూహాలను అనుసరించాలని సూచించింది. ఇందులో ఏసీ క్లాస్ లు,  ప్రీమియం రైళ్లకు డైనమిక్ ధరలను అమలు చేయాలన్నది. డిమాండ్ ఆధారంగా ఫ్లెక్సీ ఫేర్ పథకాలను క్రమం తప్పకుండా సమీక్షించాలన్నది. ఇ-వేలం విధానాలు, ప్రకటనలు, రైల్వే ఆస్తుల కమర్షియల్ వినియోగం ద్వారా నాన్-ఫేర్ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని ప్యానెల్ తెలిపింది.

Read Also: హోలీ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, బెంగళూరు నుంచి విశాఖకు ప్రత్యేక రైలు!

ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు

అటు ఖర్చు నియంత్రణ చర్యలతో పాటు నికర ఆదాయాన్ని పెంచడం ప్రాధాన్యతగా పెట్టుకున్నట్లు భారతీయ రైల్వే  పార్లమెంట్ ప్యానెల్ కు వెల్లడించింది. అందుబాటులో ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.  ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక రైళ్లను నడపడం, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, ఆన్-బోర్డ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ-ఫేర్ పథకాన్ని ప్రవేశపెట్టడం, హేతుబద్ధీకరించడం, అవసరమైన చోట రిజర్వేషన్ కోటాను సమీక్షించడం, VIKALP పథకాన్ని విస్తరించడం లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని ప్యానెల్ కు వివరించింది. అటు సరకు రవాణా, ఇతర ఆదాయాన్ని పెంచడానికి సరళీకృత నిబంధనలతో కూడిన కార్గో టెర్మినల్ విధానాన్ని ప్రవేశపెట్టడం, వ్యాగన్ పెట్టుబడి పథకాలు, గూడ్స్ షెడ్ రేటింగ్ డాష్‌ బోర్డ్ ప్రారంభం, వాణిజ్య ఆదాయ, ఇతర ఆదాయ  ఒప్పందాల కోసం ఇ-వేలం విధానాన్ని ప్రవేశపెట్టడం, ఈ-కామర్స్ సేవలపై ఫోకస్ పెట్టినట్లు రైల్వే సంస్థ వెల్లడించినట్లు  పార్లమెంట్ ప్యానెల్ తన నివేదికలో వెల్లడించింది.

Read Also:  వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు!

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×