E-Paper
Advertisement

భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!
Advertisement

Indian Railway: పంజాబ్‌ లోని లుధియానా రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. కత్రాకు వెళ్లే ప్రత్యేక ఎక్స్‌ ప్రెస్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రెండు కోచ్‌ ల మధ్య ఉన్న కప్లింగ్ తెగిపోవడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై స్టేషన్‌లో పరుగులు తీశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ ఘటన ఉదయం సుమారు 9 గంటల సమయంలో ప్లాట్‌ ఫామ్ నంబర్-2 లో జరిగింది. న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కత్రాకు వెళ్లే ప్రత్యేక రైలు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో రెండు స్లీపర్ కోచ్‌ లను కలిపే మెకానికల్ కప్లింగ్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో కోచ్‌లు ఒకదానికొకటి విడిపోయాయి.

భారీ శబ్దంతో ప్రయాణికుల భయాందోళన

Advertisement

కప్లింగ్ తెగిన సమయంలో వచ్చిన భారీ శబ్దం స్టేషన్ అంతటా మారుమోగింది. పలువురు ప్రయాణికులు దానిని పేలుడు శబ్దంగా భావించి భయపడ్డారు. కొందరు తమ సామాను కూడా తీసుకోకుండా కోచ్‌ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్టేషన్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. కప్లింగ్‌ కు సమీపంలో ఉన్న టాయిలెట్ భాగం కూడా ఈ ఘటనలో దెబ్బతింది. స్లీపర్ కోచ్‌ లోని టాయిలెట్ ఫ్లోర్ పగిలిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగకపోవడం ఊరట కలిగించింది.

వెంటనే మరమ్మతులు చేపట్టిన రైల్వే సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. దెబ్బతిన్న భాగాలను సరిచేసి, కోచ్‌ లను మళ్లీ లింక్ చేశారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత రైలు బయల్దేరింది. ప్రభుత్వ రైల్వే పోలీస్అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కప్లింగ్ విరిగిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని, ఎలాంటి పేలుడు జరగలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

రెండున్నర గంటల పాటు రైలు ఆలస్యం

Advertisement

ఈ ఘటన కారణంగా రైలు దాదాపు రెండున్నర గంటల పాటు ఆలస్యమైంది. చివరకు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కత్రా వైపు బయలుదేరింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కప్లింగ్ ఎందుకు తెగిపోయిందనే విషయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. సాంకేతిక లోపమా? మెయింటెనెన్స్ లో ఏవైనా సమస్యలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×