// // Special Train: చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే స్పెషల్ రైలు, ఎందుకంటే? -->
E-Paper
Advertisement

Special Train: చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే స్పెషల్ రైలు, ఎందుకంటే?

Special Train: చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే స్పెషల్ రైలు, ఎందుకంటే?
Advertisement

Charlapalli–Darbhanga Special Train: ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వన్ వే స్పెషల్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. శీతాకాల ప్రయాణ కాలానికి ముందు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి,  చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే ప్రత్యేక రైలును ప్రకటించింది. బీహార్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

చర్లపల్లి నుంచి వన్ వే స్పెషల్ రైలు

హైదరాబాద్ నుంచి సుదూర రైళ్లకు కాలానుగుణ డిమాండ్ బాగా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రైలు నెంబర్ 07999ను నవంబర్ 19, 2025న నడుపుతుంది. చర్లపల్లి నుంచి దర్భంగాకు ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ రూట్  వన్ వే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ రైలు ఏ స్టేషన్లలో ఆగుతుందంటే?

Advertisement

చర్లపల్లి- దర్భంగా వన్ వే ప్రత్యేక రైలును పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల,  బల్హర్షా, గోండియా, దుర్గ్, రాయ్‌ పూర్, బిలాస్‌ పూర్, రూర్కెలా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, ధన్‌ బాద్, బరౌని లాంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: పొగ మంచు ఎఫెక్ట్, 24 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే!

వన్ వే ప్రత్యేక రైలులో ఉండే క్లాసులు

Advertisement

ఈ ప్రత్యేక రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు సరసమైన ప్రయాణ ఎంపికలను అందించడం లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.  ప్రత్యేక రైలు ఛార్జీల కింద టిక్కెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ రూట్ లో నడిచే రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున ప్రయాణీకులు ముందుగానే ప్లాన్ చేసుకుని, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి బీహార్ కు వెళ్లే ప్రయాణీకులు ఈ వన్ వే ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×