E-Paper
Advertisement

Vande Bharat Train: వందే భారత్ రైలుకు తప్పిన భారీ ప్రమాదం.. పశువులను రక్షించబోయి కాపరి మృతి!

Vande Bharat Train: వందే భారత్ రైలుకు తప్పిన భారీ ప్రమాదం.. పశువులను రక్షించబోయి కాపరి మృతి!
Advertisement

Vande Bharat Train Accident:  బీహార్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నవాడా నుంచి క్యుల్ కు వెళ్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు షేక్‌ పురా జంక్షన్ దాటిన తర్వాత జఖ్రాజ్ స్థాన్ రైల్వే గేట్ సమీపంలో ట్రాక్ మీద ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ సమయంలో, గేదెలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కాపరిని కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు గేదెలతో పాటు కాపరి అక్కడిక్కడే చనిపోయారు. రైలు ముందు భాగం పెద్ద మొత్తంలో దెబ్బతిన్నది.

అకస్మాత్తుగా గేదెలు ట్రాక్ మీదికి రావడంతో ప్రమాదం

Advertisement

ఉదయం 11 గంటల ప్రాంతంలోఈ  ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా రెండు గేదెలు రైల్వే ట్రాక్‌ పైకి వచ్చాయి. వాటిని కాపాడేందుకు కచ్చి రోడ్ కు చెందిన 50 ఏళ్ల గోపాల్ యాదవ్ ట్రాక్‌ పైకి వచ్చాడు. అప్పుడే వందే భారత్ రైలు దూసుకొచ్చింది. గేదెలతో పాటు ఆయనను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్ యాదవ్ అక్కడికక్కడే మరణించాడు.  అతడి రెండు గేదెలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. గేదెలతో పాటు గోపాల్ మృతదేహాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ ప్రాంతం అంతా మాంసం ముద్దలతో భయంకరంగా మారింది.

ఎమర్సెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలెట్

Advertisement

అటు ఈ ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును ఆపాడు. అకస్మాత్తుగా బ్రేకింగ్ చేయడం వల్ల రైలులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత మంది ప్రయాణీకులు ముందువైపుకు దూసుకొచ్చారు. ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత, సాంకేతిక బృందం రెండు నిమిషాల్లోనే రైలును పంపించింది. అయితే, ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతిన్నది.

Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!

రైల్వే అధికారులపై ప్రయాణీకులు ఆగ్రహం

ఈ ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు లేకుండా క్యుల్-గయా రైల్వే విభాగంలో హైస్పీడ్ వందే భారత్ రైలును నడిపారని మండిపడుతున్నారు. ఈ సెక్షన్ లో రైలు వేగం సాధారణంగా గంటకు 95-100 కిలోమీటర్లు ఉంటుంది. అయితే షేక్‌ పురా ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ కు ఇరువైపులా జన సంచారం ఎక్కువగా ఉంటుంది. రైల్వే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. అండర్‌ పాస్‌ లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రైల్వే విభాగంలో భద్రతా ప్రమాణాలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. ప్రమాదానికి గల కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ జరుపుతోంది.

Read Also: చిత్తూరులో రైలు దోపిడీ.. అచ్చం సినిమాల్లో చూపించినట్లే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×