E-Paper
Advertisement

ప్రపంచంతో సంబంధం లేని 4 అద్భుత ప్రదేశాలు.. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవ్!

ప్రపంచంతో సంబంధం లేని 4 అద్భుత ప్రదేశాలు.. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవ్!
Advertisement

Digital Detox: ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతులు ఫోన్‌ను వదలడం లేదు. వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆఫీస్ మెయిల్స్.. ఇలా నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే, అప్పుడప్పుడు ఈ డిజిటల్ ప్రపంచానికి దూరంగా, ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి వెళ్లిపోవాలని అందరికీ అనిపిస్తుంది. కేవలం ప్రకృతి శబ్దాలు, స్వచ్ఛమైన గాలి తప్ప మరే ఇతర గోల లేని కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జన్స్కర్ వ్యాలీ, లడఖ్

Advertisement

మీరు నిజంగా ప్రపంచంతో సంబంధం తెంచుకోవాలనుకుంటే లడఖ్‌లోని జన్స్కర్ వ్యాలీని మించిన చోటు మరొకటి లేదు. ఇక్కడ కొన్ని గ్రామాలకి వెళ్లాలంటే ఇప్పటికీ రోజులు తరబడి నడవాల్సిందే. చుట్టూ మంచు కొండలు, నీలి రంగులో మెరిసిపోయే నదులు మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. ఇక్కడ మొబైల్ సిగ్నల్ అనేది ఒక విలాసం. చాలా చోట్ల అసలు నెట్‌వర్క్ ఉండదు. ఆ ప్రశాంతతలో కూర్చుని పారే నదిని చూస్తూ గడపడం మీ జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతిని మిగిలిస్తుంది.

జలోరి పాస్, హిమాచల్ ప్రదేశ్

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ట్రెక్కర్లకు స్వర్గధామం. ఇక్కడి దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య ఫోన్ సిగ్నల్ దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా అక్కడి ‘సెరోల్సర్ సరస్సు’ దగ్గరకు వెళ్తే ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి, పక్కన ఉన్నవారితో మనసు విప్పి మాట్లాడటానికి, పుస్తకాలు చదువుకోవడానికి లేదా కేవలం ప్రకృతిని ఆస్వాదించడానికి బోలెడంత సమయం దొరుకుతుంది.

అగస్త్యకూడం, కేరళ

దక్షిణ భారత దేశంలో ఇలాంటి అనుభవం కావాలంటే కేరళలోని అగస్త్యకూడం సరైన ఎంపిక. ఇది పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి. ఇక్కడికి వెళ్లాలంటే అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. అడవిలోకి వెళ్లే కొద్దీ సిగ్నల్ మాయమైపోతుంది. పక్షుల కిలకిలరావాలు, జలపాతాల హోరు తప్ప మరేమీ వినిపించవు. ఆయుర్వేద మూలికల వాసనతో నిండిన ఆ గాలి మిమ్మల్ని శారీరకంగా, మానసికగా రీఛార్జ్ చేస్తుంది.

చాంగ్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్

ఈశాన్య భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి అంతగా తెలియవు. అందులో చాంగ్లాంగ్ ఒకటి. ఇక్కడ ప్రకృతి చాలా ముడిపడి (Raw) ఉంటుంది. దట్టమైన అరణ్యాలు, కొండల మధ్య సిగ్నల్ అస్సలు ఉండదు. అక్కడి స్థానిక గిరిజనుల జీవనశైలిని గమనిస్తూ, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది గొప్ప ప్రదేశం.

ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముందుగానే మీ ఇంట్లో వారికి సమాచారం ఇవ్వండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీరు ఫోన్ చేయాలన్నా కుదరదు. అలాగే ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాసేపు ఆ ఫోన్‌ను పక్కన పడేసి, ప్రకృతిని కళ్ల నిండా నింపుకోండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×